విశాఖలో మంత్రికి పరాభవం - సీఐతో వాగ్వాదం : సీఎం పర్యటన వేళ..!!

విశాఖలో ఏపీ మంత్రికి పరాభవం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనకు వచ్చారు. నగరంలోని శారదాపీఠంలో జరిగిన వేడుకల్లో పాల్గేందుకు సీఎం పీఠానికి వచ్చారు. అయితే, మంత్రి సిదిరి అప్పల రాజు తన అనుచరులతో కలిసి పీఠం వద్దకు వచ్చారు. సీఎం రావటానికి ముందుగానే ఆయన అక్కడకు చేరుకున్నారు. అనుచరలతో కలిసి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో..అక్కడ మంత్రిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని..అనుచరులకు అనుమతి లేదంటూ ఆపేసారు.

ఆ సమయంలో మంత్రి అప్పలరాజు - సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శారదా పీఠం వార్షికో త్సవాల్లో పాల్గొనేందుకు వస్తే ఎలా అడ్డుకుంటారంటూ మంత్రి పోలీసు అధికారులను ప్రశ్నించారు. అయితే, ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో అనుచరులకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. తనతో పరుషంగా మాట్లాడిన సీఐ క్షమాపణ చెప్పాలని మంత్రి..అనుచరులు డిమాండ్ చేసారు. అప్పలరాజుపై సీఐ వ్యాఖ్యలను నిరసిస్తూ మంత్రి అనుచరుల నినాదాలు చేశారు. సీఐ మాత్రం సెక్యూరిటీనే ముఖ్యమని.. క్షమాపణలు చెప్పనని స్పష్టం చేసారు. దీంతో..మంత్రి అప్పలరాజు సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Minister Appalaraju complaint to higher officials on a police officer who insulted at Sarada Peetham

Recommended Video

    3 Capital Bill Repeals : Vizag రాజధాని కోసం North Andhra డిమాండ్ || Oneindia Telugu

    పోలీసు ఉన్నతాధికారులు మంత్రిని బుజ్జగించే ప్రయత్నం చేసారు. కానీ, సీఐ తీరుతో ఆగ్రహించిన మంత్రి అప్పలరాజు అక్కడ నుంచి వెళ్లిపోయారు. తాను ఆ అధికారి విషయం హోం మంత్రితో తేల్చుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కాసేపటికే అక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ కు ఆశ్రమ నిర్వాహకులు స్వాగతం పలికారు. వార్షికోత్సవంలో భాగంగా జరుగుతున్న ప్రత్యేక పూజల్లో సీఎం పాల్గొంటున్నారు. దీంతో..ఆశ్రమం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ వ్యవహారం పైన పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇక, మంత్రి సైతం ఈ మొత్తం ఘటన పైన ఫిర్యాదు చేసేందుకు సిద్దమయ్యారు. ఈ పరిణామం స్థానిక వైసీపీ నేతల్లో చర్చకు కారణమైంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+