ఏపీ ఒక్కటే అప్పులు చేసిందా... అప్పు తీర్చటం ఎలాగో జగన్ కు తెలుసు: మంత్రి అవంతి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై ప్రతిపక్ష పార్టీలు పదేపదే మాట్లాడుతున్నాయని, ఏపీ ఒకటే అప్పులు చేసిందా అంటూ ప్రశ్నించారు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. అయినా చేసిన అప్పులు ఎలా తీర్చాలి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసని, సీఎం గా జగన్ 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

ఏపీ మాత్రమే అప్పులు చెయ్యలేదు, వేరే రాష్ట్రాలు చేశాయి
సచివాలయంలో పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అవంతి శ్రీనివాస్ కరోనా సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు చేశాయని, ఒక ఏపీ మాత్రమే అప్పులు చేయలేదని పేర్కొన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో కూడా తమకు తెలుసని ఆయన వెల్లడించారు. ఇంకా చెప్పాలంటే ఏపీ కంటే కొన్ని రాష్ట్రాలు ఇంకా ఎక్కువగా అప్పులు చేశాయని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం, విస్తరించడం ద్వారా ఏటా 200 కోట్ల ఆదాయం సమకూరే ప్రణాళికలు రచిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.

కోవిడ్ తో దెబ్బ తిన్న పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది
కోవిడ్ తో దెబ్బతిన్న పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందని వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వందల కోట్ల ఆదాయం లక్ష్యంగా పని చేస్తున్నామని ఆయన వివరించారు. ఇక ఇదే సమయంలో పర్యాటక సంస్థ ఆస్తులకు సంబంధించి 31.08 కోట్లు లీజ్ బకాయిలు రావాల్సి ఉందని, వాటిని త్వరలోనే వసూలు చేస్తామని ఆయన వెల్లడించారు. సకాలంలో లీజు అద్దెలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఏజెన్సీలను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల చివరి వారంలో కానీ లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కానీ పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.

13 ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సెవెన్ స్టార్ హోటల్స్
13 ప్రాంతాలలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మాణానికి వేగంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి అవంతి వివరించారు. 35 కోట్ల రూపాయలతో 18 చోట్ల రెస్టారెంట్లను, హోటళ్లను ఆధునీకరించనున్నట్లు వివరించారు. అంతేకాదు ఉగాది నాటికి పర్యాటక యాప్ ను కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో కొత్తగా 8 క్రీడా పాఠశాలను ప్రారంభిస్తామన్న మంత్రి అవంతి శ్రీనివాస్
ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా 8 క్రీడా పాఠశాలను ప్రారంభిస్తామని, ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం సీఎం కప్ పేరుతో 13 రకాల క్రీడల పోటీలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన 1497 మంది క్రీడాకారులకు దాదాపు 8.55 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు అందజేశామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభిన్న ప్రతిభావంతుల కోసం ఆయా సంక్షేమ శాఖల సమన్వయంతో క్రీడా పాతశాలలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.

అభివృద్ధి చూడలేకనే వైసీపీ ఆరోపణలు
టీడీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ సత్వర సేవలు లక్ష్యంగా చేసుకుని జిల్లాల విభజన చేపట్టినట్టు అవంతి శ్రీనివాస్ తెలిపారు విమర్శలు కాకుండా జిల్లాల విభజనపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన చేసినప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల విభజన ఎందుకు చేయలేక పోయిందో చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications