పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇస్తానంటే.. ఆ పని చేసినా అర్ధం ఉంది: మంత్రి బాలినేని

మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకోవడం అలవాటుగా మారింది అంటూ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో ఒక్కొక్కరిని తిడుతూ టార్గెట్ చేస్తారు పవన్ : మంత్రి బాలినేని

ఎన్నికల్లో ఒక్కొక్కరిని తిడుతూ టార్గెట్ చేస్తారు పవన్ : మంత్రి బాలినేని

ఒక్కో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిని తిడుతూ మాట్లాడుతారని విమర్శించారు. గతంలో చంద్రబాబుని తిట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు సిఎం పదవి ఇస్తానంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నా అర్థం ఉంటుంది కానీ, చంద్రబాబును సిఎం చేయడం కోసం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారని మంత్రి బాలినేని విమర్శించారు.

ఎవరినో సీఎం చేసి రాష్ట్ర సమస్యలు ఎలా తీరుస్తారు పవన్

ఎవరినో సీఎం చేసి రాష్ట్ర సమస్యలు ఎలా తీరుస్తారు పవన్


ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఏపీ ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం పని చేయని విధంగా ఏపీలో పేదలకోసం వైసిపి ప్రభుత్వం పనిచేస్తోందని, జగన్ సర్కార్ పేదలకు అండగా ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరినో ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర సమస్యలు ఎలా తీరుస్తారు అంటూ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.

బీజేపీని రోడ్డుమ్యాప్ అడగడం విడ్డూరంగా ఉంది

బీజేపీని రోడ్డుమ్యాప్ అడగడం విడ్డూరంగా ఉంది


పవన్ కళ్యాణ్ సొంత పార్టీని పెట్టుకుని బీజేపీని రోడ్డుమ్యాప్ అడగడం విడ్డూరంగా ఉంది అంటూ సెటైర్లు వేశారు మంత్రి బాలినేని. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యిందని పేర్కొన్న మంత్రి, మళ్లీ అధికారంలోకి తీసుకు రావడం కోసం ప్రజా సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళతామన్నారు. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యతను సీఎం జగన్ మంత్రులపై పెట్టారని, సీఎం జగన్ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా పర్యటనలో జనసేనాని పవన్ ను టార్గెట్ చేసిన మంత్రి బాలినేని

ప్రకాశం జిల్లా పర్యటనలో జనసేనాని పవన్ ను టార్గెట్ చేసిన మంత్రి బాలినేని

నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సింగరకొండ ఆంజనేయ స్వామి దేవాలయం లోని స్వామివారిని దర్శించుకుని, ఆపై కొణిజేడు గ్రామం లో ఎస్బిఐ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటన సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+