రాజమండ్రిలో మహా డ్రామా; ఎన్టీఆర్ సినిమాల్లో నటుడైతే చంద్రబాబు రాజకీయాల్లో మహానటుడు: మంత్రి బొత్సా
రాజమండ్రి లో జరుగుతున్న మహానాడులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజమండ్రిలో మహా డ్రామా నడుస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు . ఏపీ సీఎంజగన్మోహన్ రెడ్డిని తిట్టడం తప్ప చంద్రబాబునాయుడు చేస్తున్నది ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలు ఇంకా కట్టిపెట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.
ఎన్టీఆర్ చావుకు, ఆయన ఆత్మ క్షోభ కు చంద్రబాబే కారణమని బొత్ససత్యనారాయణ తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ పెట్టిన ఒక్క పథకం అయినా చంద్రబాబు కొనసాగించారా.. చెప్పాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ఏది చేసినా పబ్లిసిటీ కోసమే చేశాడని పత్రికల కోసం మాత్రమే చేస్తాడని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే చంద్రబాబు వాటిని ఆపి ఏదైనా నేరుగా మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో చేసిన ఒక మంచి పని చెప్పాలని వాటి ద్వారా ప్రజలను ఓటేయమని అడగాలని బొత్స సత్యనారాయణ సూచించారు. ఎంతసేపు జగన్ గారిని ఆడిపోసుకోవడం తప్ప చంద్రబాబు చేస్తుంది ఏమీ లేదని అసహనం వ్యక్తం చేసిన ఆయన జగన్ ధనవంతుడు అయ్యాడట.. పేదలు నిరుపేదలు అయ్యారట.. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ప్రజలు నిరుపేదలు కావడానికి చంద్రబాబే కారణం అంటూ దుయ్యబట్టారు.
చంద్రబాబు హయాంలో కరువు వల్ల ప్రజల అల్లాడింది నిజం కాదా అని ప్రశ్నించారు. బడుగు బలహీనవర్గాల నాయకులు చంద్రబాబు వద్దకు వస్తే ఎంత హేళనగా మాట్లాడాడో అందరికీ తెలుసన్నారు. నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తారు అన్నది నువ్వు కాదా అంటూ నిలదీశారు. ఎవరైనా ఎస్టీలలో పుట్టాలి అనుకుంటారా.. అన్నది నువ్వు కాదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. సినిమాలలో ఎన్.టి.ఆర్ నటుడు అయితే, చంద్రబాబు రాజకీయాల్లో మహానటుడని బొత్స సత్యనారాయణ చంద్రబాబును టార్గెట్ చేశారు.
చంద్రబాబు పరిపాలనలో ఏపీ జిఎస్డిపి 6.3 శాతంగా ఉండేదని జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 7.5 శాతానికి పెరిగిందని ఇది రాష్ట్ర అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం ముఖ్యం కాదని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏం చేస్తామన్నది ముఖ్యమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
వై.ఎస్.ఆర్ స్ఫూర్తితో రాజకీయాలలో అడుగుపెట్టిన జగన్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని బొత్సా సత్యనారాయణ వెల్లడించారు. జగన్ మేనిఫెస్టో లో పెట్టిన అంశాలన్నింటినీ అమలు చేశాడని, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయడం నీకు తెలుసా అని చంద్రబాబును ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. మళ్లీ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు చెప్పే మాటలు ఎవరు నమ్మొద్దు అన్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications