విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1998 డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నా -పార్టీ శ్రేణుల్లో మనస్పర్థలు : బొత్సా..!!

|
Google Oneindia TeluguNews

నియోజకవర్గం స్థాయిలో పార్టీ శ్రేణుల్లో మనస్పర్థలున్నాయంటూ మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నారు. వారి వయసులు పెరిగిపోయాయి... వారు విద్యార్ధులకు పాఠాలు ఏమి చెబుతారని సందేహం వ్యక్తం చేసారు. ఉద్యోగులకు మళ్లీ శిక్షణ ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. అదే సమయంలో నియోజకవర్గం స్థాయిలో శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని... అవి పార్టీకి మంచిది కాదన్నారు.

నియోజకవర్గంలో కొత్త నీటి బుడగలు వస్తున్నాయి.. అవి శాశ్వతం కాదంటూ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలందించడంలో గ్రామ స్థాయి నాయకులు లంచాలడిగితే పార్టీకి మంచిది కాదని చెప్పుకొచ్చారు. నియంత రాజకీయాలు వద్దని, అందరు కలసి నిర్ణయం తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో చర్చకు కారణమయ్యాయి. అదృష్టం ఉంటే ఎవరైనా నాయకుడు అవ్వవచ్చని బొత్సా అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలని హితవుపలికారు. చీపురుపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న కిమిడి నాగార్జునకి బొత్సా కౌంటర్ ఇచ్చారు.

Minister Botsa key comments 1998 DSC qualified Candidates and party situation in his own constitutency

వయసులో చిన్నవాడివి నియోజకవర్గంపై అవగాహన లేకుండా మాట్లాడొద్దని సూచించారు. ఇది తాను రాజకీయ విమర్శ కోసం అనటం లేదని.. అతని తల్లి మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో డెవలప్ మెంట్ ఏమైనా చేసారా అనే దానికి సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం సమయం వృధా అని బొత్సా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారని చంద్రబాబు భ్రమపడ్డారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని.. ప్రతీ ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని చెప్పుకొచ్చారు.

English summary
Minister Botsa interesting comments on 1998 DSC qualified employees services and local political situation in his own constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X