జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం
రాష్టంలో జరిగిన ఎన్నికలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని ఆయన వెల్లడించారు.పేద ప్రజలు, మహిళలు తమకు అండగా నిలిచారని బొత్స అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవం కాపాడారన్న అభిమానం ముఖ్యమంత్రిపై మహిళలలో పెరగడం వల్ల నిన్న ఎద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందన్నారు.
టీడీపీ మోసాలు , కుయుక్తులు చేసిందని బొత్స విమర్శించారు. ల్యాండ్ యాక్ట్‌పై టీడీపీ చేసిన ప్రచారాలను రైతులు నమ్మలేదన్నారు. ఎన్నికల్లో కూటమి దిగజారిపోయిందని.. ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. కూటమి దౌర్జన్యాలకు పాల్పడితే మేం సంయమనం పాటించామన్నారు. ప్రతిపక్షం చేష్టలు, చేతలు,మాటలు ఎంత రెచ్చగొట్టే విధంగా ఉన్నా సంయమనం పాటించమనేది మా పార్టీ అధ్యక్షుడి ఆదేశమన్నారు.

వైసీపీ కార్యకర్తలు సహకరించడంతో మంచి పోలింగ్ జరిగిందన్నారు. 175కి 175 గెలుస్తామని.. ప్రజల నాడి తెలుసు కనుకే మా నాయకుడు ఆ నినాదం తీసుకున్నారన్నారు. రాజకీయాల్లో చిత్తశుద్ధి ముఖ్యమని, దానిని చూసే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారన్నారు. జగన్ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. పండుగ లాంటి వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications