దేవినేని ఉమా కు షాక్ : వైసిపి లోకి ఉమా సోదరుడు : జగన్ తో భేటీ..!
Recommended Video

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఏపి రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అధికా రా పార్టీ నుండి వైసిపికి.. వైసిపి నుండి టిడిపికి జంపింగ్‌లు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో టిడిపి..వైసిపి నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. అందునా మైలవరంలో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది. ఈ పరిస్థితుల్లో మంత్రి దేవినేని చెక్ పెట్టేలా వైసిపి అక్కడ పావులు కదుపుతోంది.
జగన్‌తో భేటీ..
ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసిపి అధినేత జగన్ తో భేటీ అయ్యారు. వైసీపీ నేత వసంత్ కృష్ణ ప్రసాద్.. చంద్రశేఖర్‌ను లోటస్‌పాండ్‌కు తీసుకొచ్చారు. చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. ఆయన వైసిపి లో చేరారు. మైలవరం నుండి టిడిపి అభ్యర్దిగా దేవినేని ఉమా బరిలో ఉండ గా..వైసిపి నుండి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ రెండు వర్గాల మధ్య ఎన్నికల తీవ్రత తారా స్థాయికి చేరింది.

పోలీసు కేసులు..ధర్నాలు..పోటా పోటీగా చాలెంజ్ లు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవా లనే లక్ష్యంతో వైసిపి..టిడిపి ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. మంత్రి గా ఉన్న ఉమ ను ఎలాగైనా ఓడించాల నే లక్ష్యంతో వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. ఇందులో భాగంగా మంత్రి ఉమా కు కీలకంగా సహకారం అందిస్తున్న నేతల పై దృష్టి సారించారు.
ఉమా కేసుల నుండి బయట పడలేరు
దేవినేని ఉమా కేసుల నుండి బయట పడలేరని దేవినేని చంద్రశేఖర్ చెప్పారు. అధికార పార్టీలో దోపిడీ ఎక్కువగా ఉంద ని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. తాను పార్టీలో ఇమడలేకనే వైసిపి లో చేరినట్లు చెబుతున్నారు. పార్టీ మారేం దుకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే, సొంత మనిషి ని వైసిపిలోకి తీసుకురావటం ద్వారా దేవినేని ఉమా పై మానసికంగా పై చేయి సాధించేందుకు వసంత కృష్ణ ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నా రు.రాజకీయా ల కు చిరునామాగా నిలిచిన కృష్ణా జిల్లాలో మైండ్ గేమ్‌లు..పార్టీ మార్పులు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications