తప్పులేదు.. స్వాగతిస్తున్నాం: పవన్ రాజకీయ యాత్రపై మంత్రి గంటా స్పందన
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రారంభించిన రాజకీయ యాత్రపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు. పవన్ యాత్రను తాము స్వాగతిస్తున్నామన్నారు.
అమరావతి: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రారంభించిన రాజకీయ యాత్రపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించారు. పవన్ యాత్రను తాము స్వాగతిస్తున్నామన్నారు.
సోమవారం జనసేనాని పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రాజకీయ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.

ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఒక్కో రాజకీయ నేత ఒక్కో మార్గం ఎంచుకుంటారని, అలాగే పవన్ కల్యాణ్ ప్రజా యాత్రను ఎంపిక చేసుకున్నారని మంత్రి గంటా వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను తాము పరిష్కరించామని చెప్పారు. ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు యాత్ర చేయడంలో తప్పులేదని మంత్రి శ్రీనివాసరావు అన్నారు.












Click it and Unblock the Notifications