ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు వైస్రాయి రాజకీయం - మంత్రి అమర్నాథ్..!!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో గెలవాలని వైసీపీ భారీ కసరత్తు చేసింది. పోటీకి నిలబడి సీటు దక్కించుకోవాలని టీడీపీ ప్రయత్నించింది. రెండు పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క ఓటు ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. వైసీసీకి ఏడుగురు అభ్యర్దుల గెలుపుకు కావాల్సిన ఓట్లు సరిగ్గా కావాల్సిన నెంబర్ ఉంది. టీడీపీకి ఒక్క ఓటు తగ్గుతుంది. దీంతో, రెండు పార్టీల నుంచి పెద్ద ఎత్తున మైండ్ గేమ్ మొదలైంది. ఇదే సమయంలో చంద్రబాబ రాజకీయం పైన మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు రాజీనామా ఆమోదించారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. టీడీపీ ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ గా ఆరోపించింది. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ ఆరోపణల పైన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చంద్రబాబు వైస్రాయి రాజకీయం చేయాలనుకుంటున్నాడ‌ని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమ‌ర్శించారు. 1995 లో ఎన్టీఆర్ ను గద్దె దించేటప్పుడు చంద్రబాబు చేసిన రాజకీయమే ఇప్పుడూ చేద్దాం అనుకుంటున్నాడు. తనకు చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, 130 దాకా తనతోనే ఉన్నారని ప్రచారం చేసి నాడు ఎన్టీఆర్ కు చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచాడ‌ని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఈ మైండ్ సెట్ కొత్తేమీ కాదంటూ మంత్రి ఫైర్ అయ్యారు.

Minister Gudivada Amaranth lashes out TDP chief Chandra Babu over MLC Election poltics

అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. తమకు తమ అభ్యర్దిని గెలిపించుకొనే సంఖ్య బలం ఉందని స్పష్టం చేసారు. టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23 అనే విషయాన్ని విస్మరించి వైసీపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. నలుగురు ఎమ్మెల్యేలు తమ పార్టీకి దూరమై తప్పు చేశామనే భావనలో ఉన్నారని అచ్చెన్న చెప్పుకొచ్చారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ వీడి తప్పు చేశామంటూ తమతో చెబుతున్నారని పేర్కొన్నారు. వీరంతా తమ అంతారాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. ఇక..ఈ పోలింగ్ చివరి నిమిషం వరకు ఎవరి వ్యూహాలు వారు అమలు చేసారు. ఇప్పటికీ విజయం పైన రెండు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం ఓట్ల లెక్కింపు..రాత్రికి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+