'జగన్ ముద్దు ఇస్తాడని 40 ఏళ్ల లోపు మహిళలు పారిపోతున్నారు, అందుకే పనికొచ్చాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి జవహర్ బుధవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయన అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నారన్నారు.

భాష కాదు, 10మంది రోజాలు వచ్చినా, ఎన్టీఆర్‌కు ఆనాడే చెప్పా: వాణీ విశ్వనాథ్

 జగన్ ముద్దులు ఇస్తాడని మహిళలు పారిపోతున్నారు

జగన్ ముద్దులు ఇస్తాడని మహిళలు పారిపోతున్నారు

జగన్ ఎక్కడ ముద్దులు పెడతాడోనని భయపడి నలభై ఏళ్లలోపు మహిళలు ఆయనకు దూరంగా పారిపోతున్నారని జవహర్ ఎద్దేవా చేశారు. పాదయాత్ర ముగిసేసరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

 పారడైజ్ పేపర్లలో పేరు లేదని బుకాయింపు

పారడైజ్ పేపర్లలో పేరు లేదని బుకాయింపు

పారడైజ్ పేపర్లలో పేరు లేదని జగన్ బుకాయిస్తున్నారని జవహర్ విమర్శించారు. అక్రమాస్తులను ఈడీ ఎందుకు జఫ్తు చేసిందో జగన్ చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీని బహిష్కరించి జగన్ తప్పు చేశారన్నారు. తొలిసారి కేకలు, అరుపులు లేని అసెంబ్లీని చూడబోతున్నామన్నారు.

 జగన్‌ను నమ్మే పరిస్థితి లేదు

జగన్‌ను నమ్మే పరిస్థితి లేదు

జగన్ రాజకీయ లబ్ధి కోసమే పాదయాత్ర చేస్తున్నారని మంత్రి సుజయ కృష్ణ రంగారావు అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ను నమ్మే పరిస్థితిలో లేరన్నారు. శాసన సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన విపక్షం, పూర్తిగా బాధ్యతను విస్మరించింది. ప్రతిపక్ష పార్టీ సమావేశాలను బహిష్కరించడం శోయనీయమన్నారు.

 జగన్‌కు అందుకే పనికొచ్చాం

జగన్‌కు అందుకే పనికొచ్చాం

వైసీపీలో ప్లకార్డులు పట్టుకోవడానికే పనికొచ్చామని కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా అన్నారు. జగన్ ఏనాడు ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే అవకాశం ఇవ్వడం లేదన్నారు. జగన్‌తో వేగలేకే తాము టీడీపీలో చేరామని చెప్పారు. వ్యక్తిగత అజెండా కోసమే వైసీపీ అసెంబ్లీని బహిష్కరిస్తోందని చెప్పారు. 20 మంది ఎమ్మెల్యేలను లాగి ప్రభుత్వాన్ని కూల్చుతానని చెప్పింది జగన్ కాదా అని ఎమ్మెల్యే శ్రవణ్ నిలదీశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader and Minister Jawahar hot comments on YSR Congress Party chief YS Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి