వైయస్ రాజశేఖర రెడ్డిపై మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు
దళితులకు ఉన్నత పదవులు ఇవ్వకుండా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తమను దోచుకున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: దళితులకు ఉన్నత పదవులు ఇవ్వకుండా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తమను దోచుకున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లా నాదెండ్లలో శనివారం రాత్రి ఆయన మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాన్ని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వైయస్ పాలనలో అన్ని విధాలుగా మోసపోయిన దళితవర్గాలు జగన్ వెంట ఉంటే ఆయనతోపాటు జైలుకు వెళ్లాల్సివస్తుందన్నారు.

ఇడుపులపాయలో ఇప్పటికీ దళితుల భూములను వైయస్ కుటుంబ సభ్యులు సాగు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దళితుల ఆత్మగౌరవం కాపాడుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని జవహర్ అన్నారు.
జగ్జీవన్‌రామ్‌ను ప్రధాన మంత్రి కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ వంటి నేతలు ప్రధానమంత్రులై ఉంటే దేశం ఎప్పుడో అభివృద్ధి చెంది ఉండేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.












Click it and Unblock the Notifications