అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆతిథ్యం అదరాలన్న బాబు: పుష్కరాలకే ప్రత్యేకం బోట్ అంబులెన్స్‌లు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు సైతం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా పుష్కరాల్లో కల్పించాల్సిన వైద్య సదుపాయాలపై సోమవారం ఏపీ ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ దుర్గాఘాట్ వద్ద రెండు బోట్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అత్యవసర చికిత్స విధానంలో భాగంగా 12 ర్యాపిడ్ ఎమర్జెన్సీ మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

'ఏ', 'ఏ ప్లస్' ఘాట్ల వద్ద ప్రత్యేక వైద్య బృందాలు పనిచేస్తాయని, పుష్కర్ నగర్‌లో ఆహారం పంపిణీ సందర్భంగా నాణ్యతా ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కామినేని పేర్కొన్నారు. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఘనంగా మర్యాదలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

పుష్కర ఏర్పాట్లపై ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో ఆదివారం సమీక్ష జరిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అక్షయపాత్ర, టిటిడి దేవస్థానం భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం రోజుకు లక్ష మంది భక్తులకు రుచి, శుచికరమైన భోజనం అందిస్తుంది.

గోదావరి పుష్కరాల్లో కొవ్వూరు, సిద్ధాంతంలో రైస్ మిల్లర్లు భక్తులకు భారీగా భోజన ఏర్పాట్లు చేసిన విషయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. భోజన ఏర్పాట్లపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కృష్ణా పుష్కరాలు జరిగే 12 రోజులూ కృష్ణా నదిలో జల క్రీడలు నిర్వహించేందుకూ ఏర్పాట్లు చేయాలన్నారు.

 ఆతిథ్యం అదరాలి: పుష్కరాల్లో బోట్ అంబులెన్స్ సేవలు

ఆతిథ్యం అదరాలి: పుష్కరాల్లో బోట్ అంబులెన్స్ సేవలు


మరోవైపు పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం క్రూయిజ్‌లు, ఏసి, స్పీడ్ బోట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో 10 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువనున్న ఏప్రాన్‌పై సంపూర్ణ శాఖాహార ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.

ఆతిథ్యం అదరాలి: పుష్కరాల్లో బోట్ అంబులెన్స్ సేవలు

ఆతిథ్యం అదరాలి: పుష్కరాల్లో బోట్ అంబులెన్స్ సేవలు


రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన వంటకాలను భక్తులకు రుచి చూపించాలని చెప్పారు. ఫుడ్ కోర్టుల్లో మన రాష్ట్ర వంటకాలతోపాటు, ఇతర రాష్ట్రాల వంటలను కూడా ఉంచాలని ఆయన ఆదేశించారు. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సంపూర్ణంగా సహకరించాలని విజయవాడ నగర పౌరులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

 ఆతిథ్యం అదరాలి: పుష్కరాల్లో బోట్ అంబులెన్స్ సేవలు

ఆతిథ్యం అదరాలి: పుష్కరాల్లో బోట్ అంబులెన్స్ సేవలు


రెండు రోజుల్లో నగర పౌరులనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. గోదావరి పుష్కరాల్లో తన విజ్ఞప్తిని మన్నించి భక్తులకు గోదావరి జిల్లాల ప్రజల అన్ని విధాలా సహకరించారని ఆయన చెప్పారు. రాజమండ్రిలో ఓ ఇల్లాలు భక్తుల కోసం వంట వండి, ఆమె కుమార్తెతో సైకిల్‌పై పంపించి, భక్తులకు ఉచితంగా పంపిణీ చేయించిందని, ఈ సంఘటన తనను ఎంతగానో కదిలించిందని చంద్రబాబు చెప్పారు.

 ఆతిథ్యం అదరాలి: పుష్కరాల్లో బోట్ అంబులెన్స్ సేవలు

ఆతిథ్యం అదరాలి: పుష్కరాల్లో బోట్ అంబులెన్స్ సేవలు


ఇదిలా ఉంటే కృష్ణా పుష్కరాలకు హాజరు కావల్సిందిగా రాష్టప్రతి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, లోక్‌సభ స్పీకర్, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

English summary
AP Minister for Medical and Health Services Kaminineni Srinivas is holding a meeting with officials of Medical and Health Department and representatives of private hospitals in NTR Health University in Vijayawada on arrangements of Krishna Pushkaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X