'చంద్రబాబు క్యారెక్టర్‌కు అదొక నిదర్శనం.. బాబు విజన్‌కు,జగన్ విజన్‌కు అదే తేడా..'
Recommended Video
రాష్ట్ర ప్రజల మనసెరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రజా ఆకాంక్షలు,అభీష్టాన్ని దృష్టిలో ఉంచుకుని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే పాలనా వికేంద్రీకరణే సరైందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. బుధవారం కన్నబాబు కాకినాడలో మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుపై విమర్శలు..
ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని చంద్రబాబు అబద్దాన్ని నిజం అని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. రాజధాని విషయంలో అమరావతిలో జరుగుతున్నది కృత్రిమ పోరాటమే అన్నారు.ప్రజల అభీష్టం మేరకు జగన్ పాలన సాగిస్తుంటే... చంద్రబాబు మాత్రం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అధికారణ వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు క్యారెక్టర్‌కు అదొక నిదర్శనం..
మొన్నటివరకు రాజధాని ప్రాంతాల్లో జోలె పట్టుకుని చంద్రబాబు చందాలు వసూలు చేశారని, ఆయన క్యారెక్టర్‌కు ఇదొక నిదర్శనమని కన్నబాబు ఎద్దేవా చేశారు. జోలె పట్టుకుని సేకరించిన బంగారం, డబ్బు వివరాలను బయటపెట్టాలని, అప్పుడు చంద్రబాబు నిజాయితీ ఏంటో తెలుస్తుందన్నారు.

ఇద్దరి విజన్‌కు అదే తేడా..
రాజధానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత చంద్రబాబు భంగపడ్డారని కన్నబాబు విమర్శించారు. విశాఖలో బికినీ షోలు పెట్టాలనేది చంద్రబాబు విజన్ అని.. వెనుకబడి ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ విజన్ కన్నబాబు అన్నారు. మూడు సార్లు సీఎంగా చేసి కనీసం సొంత గ్రామాన్ని కూడా చంద్రబాబు అభివృద్ది చేయలేదని మండిపడ్డారు. నారావారిపల్లెపై లేని ప్రేమ అమరావతిపై ఎందుకు పుట్టిందని ప్రశ్నించారు.

తేల్చేసిన జీవీఎల్..
మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశం అని.. అందులో తాము జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే అవసరమైన సలహాలు,సూచనలు చేస్తామని మాత్రం చెప్పింది. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా అదే విషయాన్ని వెల్లడించారు. 50 శాతానికిపైగా ఓట్లతో గెలిచిన సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. మోడీ సర్కారు అంగీకరిస్తుందని.. ఇది కేంద్ర ప్రభుత్వం తరఫున.. బీజేపీ అధికార ప్రతినిధిగా తాను చెబుతున్న మాట అని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు.












Click it and Unblock the Notifications