ప్రత్యేక హోదాను కెలుకుతున్న టీడీపీ-ఆత్మరక్షణలో వైసీపీ-కన్నబాబు వ్యాఖ్యల కలకలం
ఏపీకి విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా ప్రధానమైనది. ఎన్డీయేను గెలిపిస్తే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని గతంలో తిరుపతిలో ప్రధాని కాబోయే ముందు నరేంద్రమోడీ ఇచ్చిన హామీ కచ్చితంగా నెరవేరుతుందని అంతా ఆశించారు. కానీ అధికారంలోకి రాగానే ఎన్డీయే సర్కార్ దీన్ని సింపుల్ గా పక్కన పెట్టేసింది. అయితే రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మాత్రం దీన్ని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టేశాయి. దీన్ని కెలుకుతూ గతంలో టీడీపీని టార్గెట్ చేసి వైసీపీ అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు అదే పని వైసీపీపై మొదలుపెట్టేసింది టీడీపీ.

ప్రత్యేక హోదా గాలికొదిలేసిన కేంద్రం
2014లో అప్పటి యూపీఏ సర్కార్ ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఆ తర్వాత వచ్చిన ఎన్డీయే సర్కార్ అమలు చేస్తుందని అంతా ఆశిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ దీన్ని మెల్లగా పక్కనబెట్టేశారు. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ మిత్రపక్షం టీడీపీని వాడుకుంటూ దీన్ని విజయవంతంగా పక్కనబెట్టేశారు. దీని స్ధానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేశారు. అయినా ఇప్పటికీ వైసీపీ, టీడీపీ మధ్య పోరు కొనసాగుతూనే ఉంది అంటే దీన్ని రాజకీయంగా వాడుకోవడం ఇరు పార్టీలకు అలవాటుగా మారిపోయింది.

టీడీపీని టార్గెట్ చేసి గెలిచిన జగన్
2014లో ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీని కేంద్రంలో ఉన్న ఎన్డీయే మోసం చేయడంతో ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టారు జగన్. కేంద్రం మోసం చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ చంద్రబాబుని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదాపై జనంలో అవగాహన కల్పిస్తూ యువభేరులు పెట్టారు. చివరికి చంద్రబాబును విజయవంతంగా ఎన్డీయేకి దూరం చేసేశారు. అంతే కాదు తనకు 25 మంది ఎంపీలిస్తే ప్రత్యేక హోదా తెస్తానంటూ జనాన్ని నమ్మించి అధికారంలోకి కూడా వచ్చేశారు. 25 కాకపోయినా 22 మంది ఎంపీలు ఇచ్చినా ఇప్పటికీ హోదాపై జగన్ కేంద్రం నుంచి కనీస స్పందన తెచ్చుకోలేకపోయారు.

చంద్రబాబు రాజీనామాల అస్త్రం
గతంలో ప్రత్యేక హోదాపై తమను టార్గెట్ చేసిన జగన్ అధికారంలోకి రావడాన్ని గమనించిన టీడీపీ.. ఇప్పుడు అదే బాటలో పయనిస్తోంది. జగన్ ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోతున్నారు కాబట్టి ఎంపీలంతా రాజీనామాలు చేద్దామంటూ చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారు. దీంతో సహజంగానే జగన్ ఇరుకునపడుతున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటూ మరోసారి తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తెల్చి చెప్పేయడంతో చంద్రబాబు ఆ విషయాన్ని వాడుకుంటూ రాజీనామాల అస్త్రం సంధిస్తున్నారు. దీంతో తామెందుకు రాజీనామాలు చేయాలంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది.

జగన్ పరిస్ధితి చెప్పేసిన కన్నబాబు ?
గతంలో ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని వదిలేసి మిత్రపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేసి విజయం సాధించిన జగన్.. ఇప్పుడు అదే అంశంపై చంద్రబాబు తనను టార్గెట్ చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎప్పుడో తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. మరి అలా తాకట్టు పెట్టేసిన హోదాను తామెందుకు తెస్తామని చెప్పారో మాత్రం ఆయన చెప్పలేదు. అలాగే జగన్ ను గద్దె దించేందుకు చంద్రబాబు ప్రత్యేక హోదాను తెరపైకి తెస్తున్నారని కూడా ఆరోపించారు. గతంలో అదే ప్లాన్ తో చంద్రబాబును గద్దె దించిన వైసీపీ.. ఇప్పుడు చంద్రబాబు అదే పని చేస్తుంటే గతాన్ని గుర్తు చేసుకుని కన్నబాబు ఆందోళనతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది. మరి ప్రజలు జగన్ తరహాలోనే చంద్రబాబును ఈసారి నమ్ముతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications