మాజీ ఎస్ఈసి చంద్రబాబు తొత్తు .. మాట్లాడితే మూతి పగలగొడతా .. మంత్రి కొడాలి నానీ తిట్ల దండకం
ఏపీలో టీడీపీ నేతలపై వైసీపీ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించిన మంత్రి కొడాలి నాని సీఎం జగన్ ను ఏకవచనంతో మాట్లాడితే మూతి పగలగొడతా అన్నారు . మాజీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ. చంద్రబాబు తన తొత్తు, కాలి చెప్పును తీసుకొచ్చి ఎన్నికల అధికారిగా పెట్టుకున్నారు అని మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో తిట్ల దండకం చదివారు.

హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు రాజకీయాలు
కరోనా వైరస్ తో ప్రజలు, ప్రభుత్వం పోరాటం చేస్తుంటే కలిసిరాకపోగా హైదరాబాద్‌లో కూర్చుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారనిఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రజల ఇబ్బందితో రాజకీయాలు చెయ్యాలని చూస్తున్నారని మంత్రి కొడాలి నానీ మండిపడ్డారు . ముఖ్యమంత్రితో పాటు అధికారులపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కొడాలి నానీ కరోనా నియంత్రణలో మనమే మెరుగ్గా ఉన్నామని చెప్పారు. కరోనా నియంత్రణపై సీఎం జగన్ ప్రతి రోజు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు.

నిమ్మగడ్డ చంద్రబాబుకు కీలుబొమ్మ
ఇక ఐదేళ్ళు చంద్రబాబు చేసింది ప్రచార ఆర్భాటం అని చెప్పిన కొడాలి నానీ హైదరాబాద్ లో కూర్చుని నాటకాలు ఆడటం కాదని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో నిమ్మగడ్డ రమేష్ కీలుబొమ్మగా వ్యవహరించారని వ్యవస్థలు బాగుపడాలంటే నిమ్మగడ్డ రమేష్ లాంటి వారిని తీసేయాలని కొడాలి నానీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఎస్‌ఈసీగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్‌ను నియమించామని పేర్కొన్నారు. రమేశ్ కుమార్ ఎన్నికల సంఘం తన అయ్య జాగీరు అన్నట్టుగా సీఎస్, డీజీపీలతో చర్చించకుండా ఎన్నికలను వాయిదా వేశారని మండిపడ్డారు .

కుక్కకాటుకు చెప్పు దెబ్బలా తొలగింపు నిర్ణయం
చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించిన ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారని వ్యాఖ్యానించారు . ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఎన్నికల కమీషనర్ గా తొలగించబడ్డారని పేర్కొన్నారు కొడాలి నానీ. కృష్ణా జిల్లాలో తీసేసిన తహశీల్దార్ దేవినేని ఉమ అంటూ దేవినేని ఉమా పై నిప్పులు చెరిగారు . ఎమ్మెల్యే కావడం కోసం సొంత వదినను చంపిన చరిత్ర దేవినేని ఉమది అని వ్యక్తిగత విమర్శలు చేశారు . ఉమాకు ఏ అర్హత ఉందని ఇరిగేషన్ మంత్రిని చేశారని ప్రశ్నించారు .

దేవినేని ఉమా అలా మాట్లాడితే మూతి పగలగొడతా
కొత్తగా వచ్చిన ఎన్నికల కమిషనర్‌కు ఫేస్‌బుక్‌లో మతం రంగు పులిమి తప్పు డు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు . సీఎం జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ఏకవచనంతో మాట్లాడితే మూతి పగలగొడతా అంటూ దేవినేని ఉమాని హెచ్చరించారు. టీడీపీ నాయకులు రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నా టీడీపీ నాయకుల తీరు మారటం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నానీ .
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications