జనసేనలో టీడీపీ విలీనం చేయండి-పవన్ కమ్మవర్గం గురించా : ఇద్దరికీ జగన్ పంజా దెబ్బలు తప్పవు : కొడాలి నాని ఫైర్..!
టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాజాగా రాజమండ్రి వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. పవన్ కమ్మవర్గానికి అండగా ఉంటానని చెప్పటం సిగ్గు చేటన్నారు. కమ్మ వర్గంలో ఎవరూ తాము జగన్ కారణంగా నష్టపోయామని..తమను ఆదుకోమని పవన్ ను కోరారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాత్రమే అలా కోరి ఉంటారని చెప్పుకొచ్చార. పవన్ మైండ్ బ్లాక్ నిర్ణయాలు వాళ్ల పార్టీలోనే నచ్చటం లేదన్నారు.

సొంత పుత్రుడపై నమ్మకం లేకనే దత్త పుత్రుడు
చంద్రబాబుకు సొంత పుత్రుడు పైన నమ్మకం లేక దత్త పుత్రుడు పైన ఆశలు పెట్టుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ను అధికారంలోకి తేవటమే పవన్ లక్ష్యమని ఆరోపించారు. జనసేనలో టీడీపీని విలీనం చేయాలని కొడాలి నాని డిమాండ్ చేసారు. చంద్రబాబు చేతిలో పవన్ గంగిరెద్దు అంటూ వ్యాఖ్యానించారు. ఇద్దరు కలిసి ఎన్ని నాటకాలు ఆడినా..కుట్రలు చేసినా ..ఇక్కడ ఉంది యువ సింహం జగన్ అని చెప్పుకొచ్చారు. జగన్ పంజా దెబ్బలు వారిద్దరికీ తప్పవని హెచ్చరించారు.

జగన్ చీల్చి చెండాడుతారు
ఇప్పటికే ఇద్దరికీ ఏపీలో రాజకీయంగా అడ్రస్ లేదని.. భవిష్యత్ లోనూ నష్టం తప్పదని జోస్యం చెప్పారు. జగన్ మిమ్నల్ని చీల్చి చెండాడుతారంటూ హెచ్చరించారు. డ్రగ్స్ ఆఫ్ఘన్ నుంచి తాడేపల్లికి లింక్ ఉన్నాయని బాబు అంటున్నారని..ఎర్రచందనం..గంజాయి స్మగ్లింగ్ ఆయన అధికారంలో ఉన్న సమయంలో చేసారని ఆరోపించారు. ఆదాయపు పన్నులు ఎగ్గొట్టి హెరిటేజ్ లో డబ్బులు పెట్టారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రెండు వేల కోట్లకు ఎలా ఎదిగారో ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేసారు.

కమ్మ వర్గానికి పవన్ అండగా ఉంటారా
డ్రగ్స్ తీసుకొనేది చంద్రబాబు కుటుంబ సభ్యులే అంటూ వ్యాఖ్యానించారు. జగన్ పైన ఎన్ని నిందలు వేయాలనుకున్నా సాధ్యం కాదన్నారు. డ్వాక్రా సంఘాలు తానే పెట్టానని చంద్రబాబు చెబుతున్నారని...పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో డ్వాక్రా సంఘాలు పెట్టారని గుర్తు చేసారు. వైఎస్సార్ రూపాయి వడ్డీనీ పావలాకు తగ్గించారని చెప్పారు. చంద్రబాబు 90 లక్షల మంది మహిళలను మోసం చేసారని ఆరోపించారు. 2014 ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని చెప్పారు.

డ్వాక్రా సంఘాలకు జగన్ చెప్పింది చేస్తున్నారు
2019 ఎన్నికల నాటికి అప్పును నాలుగు విడతలుగా చెల్లిస్తానని జగన్ చెప్పారని గుర్తు చేసారు. ఇప్పటికే రెండు విడతల్లో 13 వేల కోట్ల రూపాయాలను వారికి ఇచ్చారని వివరించారు. దేశ చరిత్రలోనే ఎప్పుడు లేదన్నారు. అప్పులు చేసినా సంక్షేమ పధకాల అమలు చేస్తున్నారని చెబుతూ.. అప్పుల గురించి మాట్లాడే సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పు ట్టారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా..జగన్ మాట తప్పరు ..చెప్పింది చేసి తీరుతారని నాని స్పష్టం చేసారు. జగన్ జీవితాంతం సీఎంగానే ఉంటారని మంత్రి కొడాలి నాని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications