మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్, తొలిగింపు- లిస్టులో నెక్స్ట్..!!

ఏపీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలం పూర్తి అవుతోంది. ఈ సమయంలో మంత్రుల పని తీరు పైన ముఖ్యమంత్రి ఫోకస్ చేసారు. ఇప్పటికే మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు. సమర్ధవంతంగా పని చేయాలని సూచిస్తున్నారు. ఇదే విధం గా మంత్రుల పేషీలు.. వారి సిబ్బంది పైనా ఫోకస్ చేసారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే మంత్రులు తమ సిబ్బంది నియామకంలో కీలక సూచనలు చేసారు. కాగా, ఇప్పుడు మంత్రులు ఏరి కోరి తెచ్చుకొని.. విమర్శలకు కారణమవుతున్నవారి పైన కఠిన చర్యలకు సిద్దమయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో మంత్రుల పేషీల్లో సంచలనంగా మారుతోంది.

చంద్రబాబు నిర్ణయంతో
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రులు తమ వ్యక్తిగత.. పేషీ సిబ్బంది విషయంలో ఏ రకమైన విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొందరు మంత్రుల పేషీల్లో సిబ్బందిపైన ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హోం మంత్రి అనిత సిబ్బంది విషయంలో ఆరోపణలు రావటంతో తప్పించారు. ఆ తరువాత మంత్రులు అలర్ట్ అయ్యారు. కొందరు మంత్రుల ఓఎస్డీలు, పేషీ సిబ్బంది పైన విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పని చేసిన వారినే కొందరు మంత్రులు కొనసాగించటం పైన ఫిర్యాదులు అందాయి. అయితే, కీలక శాఖల మంత్రుల వద్ద పని చేస్తున్న కొందరు సిబ్బంది పైన వస్తున్న విమర్శలతో ముఖ్యమంత్రి నివేదికలు కోరారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.

minister-kollu-ravindra-osd-rajababu-removes-due-to-corruption-allegations

కొల్లు ఓఎస్డీ తొలిగింపు
తాజాగా మంత్రి కొల్లు ఓఎస్డీ తొలిగింపు వ్యవహారం మంత్రుల వద్ద చర్చగా మారింది. ఎక్సైజ్‌, గను ల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తోన్న రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టిం ది. రాజాబాబు గనులశాఖ అధికారి. ఆ శాఖలో జాయింట్‌డైరెక్టర్‌గా పనిచేస్తూ 2024 మార్చి లో పదవీ విరమణ పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన్ను కొల్లు రవీంద్రకుఓఎస్‌డీగా తీసుకోవాలని సంప్రదింపులు జరిగిన సమయంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. గనులశాఖలో పనిచేసినప్పుడు ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. అలాంటి అధికారిని మంత్రి ఓఎస్‌డీగా ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు వచ్చినా నాడు మంత్రి లెక్కపెట్టలేదు. రాజాబాబే ఓఎస్డీగా కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నారు. ఈ 10 నెలల పాలనలో గనులశాఖ పనితీరు, అప్పీల్‌ రివిజన్‌ కేసులపై అనేకానేక ఆరోపణలు వచ్చాయి.

Take a Poll

లిస్టులో నెక్స్ట్
రాజాబాబు వ్యవహారంలో చోటు చేసుకున్నపరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లాయి. వీటిపై సీఎం నివేదిక తెప్పించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఓఎస్‌డీనే తప్పించా లని ఆదేశించారు. దీంతో రాజాబాబు ప్రభుత్వం తనను తప్పించబోతోందన్న సమాచారంతోనే విధుల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక, ఇదే తరహాలో ఇతర మంత్రుల పేషీల్లో ఎవరెవరు ఉన్నారనే సమాచారం పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతో.. మంత్రులు తమ సిబ్బంది విషయంలో అప్రమత్తం అయ్యారు. మరి కొందరు మంత్రుల పేషీల్లోని సిబ్బంది పైన ఆరోపణలు ఉండటంతో... వారి పైనా నివేదికలు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. నివేదికల ఆధారంగా వారి పైన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు మంత్రుల్లో సీఎం తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ కనిపిస్తోంది. వచ్చే వారం మరిన్ని నిర్ణయాలు ఉంటాయనే చర్చ సచివాలయ వర్గాల్లో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+