చంద్రబాబు అవినీతి అనకొండ; బయటపడింది ఆవగింజంతే: ఘాటుగా ఏపీ మంత్రి వ్యాఖ్యలు!!
ఏపీలో ప్రస్తుతం రాజకీయం అంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతుంది. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చెయ్యటంతో రాజకీయంగా ఆయనపై, టీడీపీపై దాడి మొదలైంది. వైసీపీ నేతలు వరసగా చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఏపీలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు జారీ చేయడం వెనుక పెద్ద దుమారం నడుస్తుంది. చంద్రబాబు అవినీతి బయట పడింది ఆవగింజంత.. బయట పడాల్సింది కొండంత అంటూ వైసిపి నేతలు బాబును టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబు, నారా లోకేష్ ల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు నారా లోకేష్ లను అరెస్ట్ చేస్తేనే ఏపీలో శాంతిభద్రతలు నెలకొంటాయని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి ఐటీ నోటీసులు ఇవ్వడంతో బయటకు వచ్చిందని, ఆయన అవినీతి అనకొండ అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతి 118 కోట్లు మాత్రమే కాదు ఇంకా చాలానే ఉంది అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.
చంద్రబాబు బ్రోకర్ అని.. లోకేష్ జోకర్ అని వ్యాఖ్యలు చేసిన ఆయన చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఇప్పుడు తేలిపోయిందని కోట్లు ఖర్చుపెట్టి ఫేక్ ఉద్యమాలు చేశారంటూ ఘాటుగా విమర్శించారు. లోకేష్ చేస్తున్న ఘనకార్యం వల్ల టిడిపి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అని పేర్కొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ, లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ మరింత దిగజారి పోయిందని సెటైర్లు వేశారు.
చంద్రబాబు అవినీతి కేసుల్లో సిబిఐ, ఈడి జోక్యం చేసుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. అమరావతి ముసుగులో చంద్రబాబు వేలకోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ వేసారని మంత్రి కొట్టు ఆరోపించారు. చంద్రబాబు సింగపూర్ ఈశ్వరన్ తో కలిసి పనిచేసిన అవినీతి దందా ఉందని, చంద్రబాబు కచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. 2,000 మంది గుండాలతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని మంత్రి కొట్టు విమర్శించారు.












Click it and Unblock the Notifications