నోరు జాగ్రత్త, అభివృద్దిలో నాతో పోటీ పడాలి: మాణిక్యాలరావుకు బాపిరాజు సవాల్

Posted By:
Subscribe to Oneindia Telugu

ఏలూరు: ఏఫీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుకు టిడిపి నేతలకు మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. జన్మభూమి సభలోనే మంత్రి మాణిక్యాలరావు టిడిపి నేతల పై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత విమర్శలను గుప్పిస్తున్నారు.అయితే మంత్రి మాణిక్యాలరావుపై మరోసారి టిడిపి నేతలు విరుచుకుపడ్డారు.అభివృద్దిలో తనతో పోటీపడాలని మంత్రి మాణిక్యాలరావుకు జిల్లా పరిషత్ ఛైర్మెన్ మాణిక్యాలరావు సవాల్ విసిరారు.

మగాడినై రెచ్చిపోతా, నన్ను కట్ చేస్తే ఏపీనే కట్ చేస్తా: మాణిక్యాలరావు సంచలనం

పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి నేతల మధ్య అంతరం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం జన్మభూమి సభలోనే మంత్రి మాణిక్యాలరావు టిడిపిపై విమర్శలు గుప్పించారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో టిడిపి, బిజెపి నేతల మథ్య విభేధాలున్నాయి.

చచ్చినా వైసీపీలో చేరను, ఆత్మాభిమానం చంపుకోలేను: ఎంపీ కొత్తపల్లి గీత

ఈ రెండు పార్టీల మధ్య అంతరం కొనసాగుతోంది. అయితే మంత్రి మాణిక్యాలరావు అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. అయితే ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది.

మంత్రి మాణిక్యాలరావు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి

మంత్రి మాణిక్యాలరావు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి

మంత్రి మాణిక్యాలరావు నోరు జారడం మామూలేనని జిల్లా పరిషత్ ఛైర్మెన్ ముళ్ళపూడి బాపిరాజు అభిప్రాయపడ్డారు.మాణిక్యాలరావు గెలుపు కోసం కృషి చేసిన టిడిపి కార్యకర్తలను మంత్రి మాణిక్యాలరావు దూరం పెట్టారని ముళ్ళపూడి బాపిరాజు విమర్శలు గుప్పించారు.

అభివృద్దిలో తనతో పోటీ పడాలి

అభివృద్దిలో తనతో పోటీ పడాలి

అభివృద్దిలో తనతో మంత్రి మాణిక్యాలరావు పోటీ పడాలని జిల్లా పరిషత్ ఛైర్మెన్ ముళ్ళపూడి బాపిరాజు సవాల్ విసిరారు.ఈ విషయంలో మంత్రి తనతో పోటీకి సిద్దమా అని మాణిక్యాలరావు సవాల్ విసిరారు. ముళ్ళపూడి బాపిరాజు వర్గీయులను ఉద్దేశించి మంత్రి మాణిక్యాలరావు జన్మభూమి సభలోనే విమర్శలు గుప్పించడంపై బాపిరాజు తీవ్రంగా స్పందించారు.

టిడిపి, బిజెనపి మధ్య అగాధం

టిడిపి, బిజెనపి మధ్య అగాధం

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టిడిపి, బిజెపి నేతల మధ్య దూరం పెరుగుతోంది. టిడిపి, బిజెపి నేతల మధ్య దూరం పెరుగుతోంది. టిడిపి నేతలను మంత్రి మాణిక్యాలరావు దూరం పెడుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు వైసీపీ నేతలకు ప్రాధాన్యతను ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు గుప్పించుకొంటున్నారు.

రాజకీయ భవితవ్యం

రాజకీయ భవితవ్యం

తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టును బాపిరాజు ఆశించాడు. అయితే మిత్రపక్షాలతో పొత్తు కారణంగా 2014 ఎన్నికల్లో బాపిరాజుకు ఈ స్థానంలో టిక్కెట్టు దక్కలేదు. అంతేకాదు ఎన్నికల సమయంలోనే మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కూడ కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరారు. బిజెపికి ఈ సీటును కేటాయించడంతో బాపిరాజుకు జడ్పీ చైర్మెన్ పదవి దక్కింది.అయితే వచ్చే ఎన్నికల కోసం బాపిరాజు ప్లాన్ చేసుకొంటున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. దీంతోనే రెండు పార్టీల మధ్య వివాదాలు సాగుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Westgodavari zp chairman Mullapudi Bapiraju challenged to minister Manikyala Rao compete with him in development acitvities. He spoke to media on Friday at Elururu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి