గజల్‌కు మద్దతిచ్చి సిగ్గుపడుతున్నా, ఆ వీడియోలు చూసి షాకయ్యా: మంత్రి మాణిక్యాలరావు సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu
  గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

  అమరావతి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు మద్దతును ప్రకటించిన ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు గురువారం ఉదయం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొన్నారు. మంత్రి మద్దతు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

  అప్పుడు గజల్ శ్రీనివాస్ : 'గర్భిణీలు దేవతలు, దండం పెడతా', నేడు లైంగిక వేధింపుల్లో అరెస్ట్

  లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన గజల్ శ్రీనివాస్‌ను ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు బుదవారం నాడు మద్దతుగా మాట్లాడారు.ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల నేపథ్యంలో మంత్రి మాణిక్యాలరావు వెనక్కు తగ్గాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  గజల్ శ్రీనివాస్ కేసు: 'చెప్పుతో కొట్టాలనుకొన్నా, కెమెరా పెట్టేందుకు వారం రోజులు కష్టపడ్డా'

  లైంగిక ఆరోపణల కేసులో గజల్ శ్రీనివాస్ అరెస్ట్ ఇప్పటికే సంచలనం కల్గిస్తోంది మరిన్ని వీడియోలను బాధితురాలు పోలీసులకు అప్పగించింది.ఈ ఘటనలు చోటు చేసుకొన్న సమయంలో కూడ మంత్రి గజల్ శ్రీనివాస్ కు మద్దతివ్వడం వివాదాస్పదమైంది.

  గజల్ శ్రీనివాస్ కేసు: 'ఆమె వెనుక ఎవరైనా ఉన్నారేమో, మసాజ్ టైంలో అక్కడే ఉన్నా'

  గజల్ శ్రీనివాస్‌కు మద్దతిచ్చి సిగ్గుపడుతున్నా

  గజల్ శ్రీనివాస్‌కు మద్దతిచ్చి సిగ్గుపడుతున్నా

  ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు మద్దతుగా తాను బుదవారం నాడు చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు. గజల్ శ్రీనివాస్ ఈ రకంగా వ్యవహరిస్తాడనుకోనేదని ఆయన అభిప్రాయపడ్డారు. గజల్ శ్రీనివాస్ చేసిన అనైతిక చర్యలకు తాను మద్దతుగా మాట్లాడడం పట్ల సిగ్గుపడుతున్నట్టు ఆయన చెప్పారు.

   నా వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నా

  నా వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నా

  ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ గజల్ శ్రీనివాస్‌కు మద్దతుగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నట్టు మంత్రి మాణిక్యాలరావు గురువారం ఉదయాన్నే ప్రకటించారు. బుదవారం నాడు గజల్ శ్రీనివాస్ కు మద్దతుగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడారు.

  ఆ వీడియోలు చూసి షాకయ్యా

  ఆ వీడియోలు చూసి షాకయ్యా

  గజల్ శ్రీనివాస్ వీడియోలు చూసి తాను షాకయ్యాయనని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ఈ విషయాలు తెలియకనే తాను గజల్ శ్రీనివాస్‌ను సమర్థించానని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వీడియోలు చూసి షాకైన విషయాన్ని ఆయన మీడియాకు వివరించారు.

   కఠినంగా పోలీసులు వ్యవహరించాలి

  కఠినంగా పోలీసులు వ్యవహరించాలి

  గజల్ శ్రీనివాస్ పై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి మాణిక్యాలరావు కోరారు. నాణేనికి ఒకవైపు మాత్రమే తాను చూశానని మాణిక్యాలరావు చెప్పారు. ఈ తరహ వ్యక్తిత్వం ఉన్నవాడని తనకు తెలియదన్నారు.చిన్నతనం నుండి గజల్ శ్రీనివాస్ తనకు తెలుసునని చెప్పారు. కానీ, రెండో వైపు మాత్రం గజల్ శ్రీనివాస్ వ్యవహరం తనకు తెలియదన్నారు. అందుకే అలా మాట్లాడానని మాణిక్యాలరావు వివరణ ఇచ్చారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra pradesh Endowment minister Manikyala Rao withdraw his comments over Ghazal Srinivas on Thursday at Amaravati.He was supported to Ghazal Srinivas on Wednesday .

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి