స్మగ్లింగ్ డెన్‌గా కాకినాడ - బాస్ ఎవరు, తేలిందేంటి..!!
ఏపీ రాజకీయాల్లో సీజ్ ది షిప్ కలకలం రేపుతోంది. కాకినాడలో పవన్ పర్యటన..బియ్యం అక్రమ రవాణా పైన చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో సంచలనంగా మారింది. బియ్యం మాఫియా పైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పవన్ వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు స్పందించారు. పవన్ ను అడ్డుకుంటుందెవరని ప్రశ్నించారు. దీనికి కౌంటర్ గా మంత్రి మనోహర్ కాకినాడ పోర్టుల్లో బియ్యం రవాణా లెక్కలను బయట పెట్టారు. పోర్టుకు సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు.
పవన్ రాకతోనే
కాకినాడ పోర్టు నుంచి బయ్యం ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి వెనుక మాఫియా ఉందని పవన్ ఆరోపించారు. రవాణా చేస్తున్న షిప్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు మాఫియా ను నియంత్రించటంలో విఫలమవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తననే కాకినాడ పోర్టుకు రాకుండా అడ్డుకున్నారని...రవాణా అవుతున్న షిప్ ను చూడనీయటం లేదంటూ ఆసక్తి కర కామెంట్స్ చేసారు. దీని పైన పవన్ ను అడ్డుకుంటుందెవంటూ వైసీపీ నేతలు ప్రశ్నించారు. మంత్రి మనోహర్ వైసీపీ నేతల వ్యాఖ్యల పైన స్పందించారు. రాష్ట్రంలోని పోర్టుల నుంచి బియ్యం ఏ విధంగా రవాణా అవుతుందో వివరించారు. ప్రజలకు జరుగుతున్నది తెలియచేసేలా పవన్ ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. షిప్ వద్దకు తమను వెళ్లనీయలేదని వెల్లడించారు.

పక్కదారి పట్టించారు
పవన్ కళ్యాణ్ పర్యటనలో ఎన్నో అంశాలు వెలుగులోకి వచ్చాయని, దేశ భద్రతకు భంగం కలిగించేలా అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని మనోహర్ వివరించారు. 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడలో తనిఖీల్లో పట్టుకున్నామన్నారు. 13 కంపెనీలపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. దీంతో వారు కోర్టుకు వెళ్లి బియ్యం విడుదలకు ఆదేశాలు తెచ్చారని.. వారి నుంచి 43.50 కిలోల వొప్పున ధర కట్టి బియ్యం వెనక్కి ఇచ్చామని చెప్పారు. కాగా, అసలు కాకినాడలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందనన్నారు. కిలో పది రూపాయల చోప్పున ప్రజల నుంచి రేషన్ బియ్యం కొని స్మగ్లింగ్‌కు పంపుతున్నారని అన్నారు. కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి బాగా జరిగిందని చెప్పుకొచ్చారు.
పోర్టు నుంచి స్మగ్లింగ్
వైసీపీ హయాంలో అరవిందో నుంచి పోర్ట్ లాక్కుని మరీ బియ్యం ఎగుమతి చేశారని ఆరోపించారు. 23,51,218 కృష్ణపట్నం, 38,2000 మెట్రిక్ టన్నులు విశాఖ నుంచి పంపారని.. కాకినాడ పోర్ట్ నుంచి కోటి 30,18, 400 మెట్రిక్ టన్నుల బియ్యం.. అంటే సుమారు 48,537 కోట్ల రూపాయ ల విలువ చేసే బియ్యం ఎగుమతి చేశారని వివరించారు. దీని వెనుక ఎవరున్నారో బయటకు లాగుతున్నామని చెప్పారు. ప్రశ్నించారు. కార్పొరేట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కెవి రావు కుటుంబాన్ని బెదిరించి 41శాతం వాటా రాయించుకున్నారని, పోర్ట్‌ను పూర్తి గా లాక్కున్నారని ఆరోపించారు. కాకినాడను స్మగ్లింగ్ డెన్ గా మార్చింది ఎవరని.. డాన్ ఎవరో తెలియాలని వ్యాఖ్యా నించారు. రాష్ట్రంలో రేషన్ అక్రమాలు అరి కట్టేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications