నిజమైన నాయకుడికే పట్టం...వైసీపీ సునామీ రాబోతుంది!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఏపీలో అనేక ప్రాంతాలలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైసిపి ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతుందని ఆరోపిస్తోంది. జగన్ ఓటమి ఖాయమైందని, అందుకే ఇలా దాడులు చేస్తున్నారన్నారు.
జూన్ 4 న చరిత్ర సృష్టించబోతున్నాం
అయితే దీనిపై స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున ఏపీలో దాడులకు కారణం చంద్రబాబు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తుందని ఇది తట్టుకోలేకనే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారని మంత్రి మేరుగ నాగర్జున తెలిపారు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త చరిత్ర సృష్టించబోతుందని ఆయన పేర్కొన్నారు.

వైఎస్ఆర్సిపి సునామీ రాబోతుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామ రాజ్యం రాబోతుందని మేరుగ నాగార్జున వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధమని, ఈ యుద్ధంలో ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారన్నారు. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సిపి సునామీ రాబోతుందని పేర్కొన్నారు. పేదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని దాడులు చేస్తున్నట్టు మంత్రి మేరుగు నాగార్జున ఆరోపించారు.
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ వల్లే దాడులు
చంద్రబాబు ఫ్రస్టేషన్లోకి వెళ్ళాడని, పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమస్యాత్మక ప్రాంతాలలో సెక్యూరిటీని పెంచాలని కోరినప్పటికీ ఎన్నికల కమిషన్ పట్టించుకోవడంలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని, పోలీసులు టిడిపికి కొమ్ముకాసారని మేరుగ నాగార్జున ఆరోపించారు.
దారుణంగా దాడులకు తెగబడిన టీడీపీ
అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన పోలీస్ అధికారులపై విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు. వైసీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకుని టిడిపి దాడులకు ఉసిగొలిపిందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికలలో టీడీపీ దారుణంగా దాడులకు తెగబడింది అని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. డిబిటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా టిడిపి నేత చంద్రబాబు అడ్డుకున్నారని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు.












Click it and Unblock the Notifications