పక్కనే ఉండి పరామర్శించలేదు...శవాలపై పైసలు:జగన్ పై మంత్రి నక్కా ధ్వజం
గుంటూరు:గోదావరిలో లాంచీ ప్రమాదం ఘటనపై వైఎస్ జగన్ వ్యాఖ్యలను మంత్రి నక్కా ఆనందబాబు తప్పుబట్టారు. గుంటూరులో టిడిపి రాష్ట్ర కార్యాలయంలో మంత్రి నక్కా ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రకృతి వైపరీత్యం వల్లే గోదావరి పడవ ప్రమాదం జరిగిదని...ఇది ఎంతో దురదృష్టకర సంఘటన...చింతించాల్సిన ఘటన గా అభివర్ణించారు.మానవత్వం ఉన్న ఎవరైనా దీనిపై సానుభూతి వ్యక్తం చేస్తాం.కానీ ఈ ప్రమాదంపై ప్రతిపక్ష నేత జగన్ వైఖరి సిగ్గు చేటన్నారు.జగన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం మన దౌర్బాగ్యమని ధ్వజమెత్తారు.ప్రమాదం జరగడంతోనే ముగ్గురు మంత్రులు, రెండు జిల్లాల అధికార యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో పాల్గొన్నారని మంత్రి నక్కా చెప్పారు.

సంఘటన స్థలంలోని పరిస్థితిని చూసి సీఎం ఎంతో చలించిపోయారన్నారు.శుక్రవారం కోర్టుకు వెళ్లడానికి రెండు రోజులు పాదయాత్ర ఆపివేసే జగన్... అంతమంది గిరిజనులు చనిపోతే పక్కనే ఉండి కనీసం పరామర్శించలేరా?...పశ్చిమ గోదావరి జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్న జగన్ కనీసం బాధితులను పరిమర్శించలేదని నక్కా ఆనందబాబు విమర్శించారు.
"ప్రమాదాలను సర్కారీ హత్యలని అనడానికి సిగ్గు ఉండాలి.శవాల పై పైసలు ఏరుకునే రకం జగన్.వైఎస్ హయాంలో ఎన్నో ఘటనలు జరిగి ప్రజల ప్రాణాలు పోతే అవి సర్కారీ హత్యలేనా?..వైఎస్ పాలనలో మక్కా మసీద్ లో పేలిన బాంబ్ లు ఆ ప్రభుత్వమే పెట్టించిందా?"...అన్ని మంత్రి నక్కా ఆనందబాబు జగన్ పై ధ్వజమెత్తారు. బిజెపి నూతన అధ్యక్షుడుకన్నా లక్ష్మీనారాయణ స్వచ్చమైన సంఘ్ కార్యకర్తలా మాట్లాడాటం హాస్యాస్పదం అన్నారు.
Recommended Video

పదవుల కోసం వారం రోజుల్లో రెండు పార్టీల్లో కన్నాదోబుచులాడారన్నారు. కన్నాకు సిగ్గులేకపోయినా బ్యానర్లు కట్టే కార్యకర్తలకైనా సిగ్గు ఉండాలన్నారు.రాష్ట్ర విభజన సమయంలో సీఎం పదవి కోసం పాకులాడిన చందంగానే నేడు బిజేపి అధ్యక్ష పదవి కోసం కన్నాపాకులాడాడు,కన్నాకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల మనోభావాలు అవసరం లేదని నక్కా ఆనందబాబు విమర్శించారు.బిజేపి సిగ్గులేని రాజకీయాలు చేస్తోందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications