వైఎస్ జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా మంత్రి నారా లోకేష్ సూటిప్రశ్నలు!!

ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన మంత్రి నారా లోకేష్ స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఎలాన్ మస్క్ ఈవీఎం ల హ్యాకింగ్ పై చేసిన పోస్ట్ నేపధ్యంలో పెద్ద దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జగన్ ఈవీఎంల విషయంలో స్పందించారు.

ఈవీఎంలపై ఎలాన్ మస్క్ పోస్ట్ తో స్పందించిన జగన్
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్ లో వాడుతున్నారని జగన్ పేర్కొన్నారు. మన దేశంలో కూడా అలాగే ఉపయోగించాలని వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలని, ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Minister Nara Lokesh direct questions to ys Jagan post on EVMs rushikonda palace

మీరు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేసినట్టా? ఓడితే కాదా: లోకేష్
ఇక జగన్ చేసిన ట్వీట్ పైన టిడిపి నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా జగన్ పైన ఘాటుగా స్పందించారు. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని జగన్ చెప్పారని. మరి ఇప్పుడేమైంది అంటూ ప్రశ్నించారు. మీరు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేస్తున్నట్టు.. ఓడిపోతే ఈవీఎంలు సరిగా పనిచేయనట్టా అంటూ టార్గెట్ చేసిన లోకేష్ ప్రజాస్వామ్యం అంటే జగన్ కు అలర్జీ అని మండిపడ్డారు.

జగన్ పై లోకేష్ ఆగ్రహం...
జగన్ ప్రజల హక్కులను పరిరక్షించడానికి అంకితమైన సంస్థలను, వ్యవస్థలను క్రమ పద్ధతిలో నాశనం చేశారని ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వాటిని ఒక్క దెబ్బతో కొట్టిపారేశారని లోకేష్ పేర్కొన్నారు. జగన్ ప్రజల హక్కులను హరించారని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టుకున్న ప్రభుత్వ ఫర్నిచర్ ఎప్పుడు వెనక్కు పంపుతున్నారో చెప్పాలన్నారు.

రుషి కొండ నిర్మాణాలపై లోకేష్ ప్రశ్నలు
అంతేకాదు పేదల పేరు చెప్పే మీరు రుషి కొండలో 560 కోట్లతో ప్యాలెస్ ఎలా నిర్మించుకున్నారో చెప్పాలని లోకేష్ ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారో ఆలోచించి దానిని అంగీకరించండి అంటూ మంత్రి లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే మాజీ సీఎం జగన్ కు హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+