ప్రధాని మోడీ తర్వాత ఆ ఘనత సాధించిన ఏకైక నాయకుడిగా నారా లోకేష్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే "స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ (SVP)" లో పాల్గొనాలని హైకమిషన్ ప్రత్యేక ఆహ్వానం అందించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ లేఖ పంపి ఆహ్వానించారు.

ఏపీ అభివృద్ధిపై ఆస్ట్రేలియా ప్రశంసలు..

ఆస్ట్రేలియన్ హైకమిషన్ లేఖలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మానవ వనరులు, సాంకేతిక రంగం, ఆర్థికాభివృద్ధి దిశగా సాధించిన పురోగతిని ప్రశంసించింది. ముఖ్యంగా విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, "ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్" దేశవ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంది. కాగా స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యం కావడం ద్వారా మంత్రి నారా లోకేష్‌కు ఆస్ట్రేలియాలోని కీలక రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం లభించనుంది. ఈ పర్యటనలో విద్య, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక వసతులు, ఐటీ రంగం వంటి విభాగాలపై చర్చించనున్నారు.

minister-nara-lokesh-received-another-rare-honor-from-australia

గతంలో పాల్గొన్న మోడీ..

ఆస్ట్రేలియా ప్రభుత్వం గత 20 ఏళ్లలో భారత్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఈ జాబితాలో 2001లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఆయన అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా SVPలో పాల్గొని ఆస్ట్రేలియాతో సంబంధాలను బలోపేతం చేశారు. ఇప్పుడు అదే వేదికలో నారా లోకేష్ పాల్గొనడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రాధాన్యతలను ఆస్ట్రేలియా ముందు ఉంచి, పెట్టుబడులు రప్పించడం, విద్య-టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించడం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు వంటి అంశాల్లో అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల్లో కూడా ఏపీ-ఆస్ట్రేలియా మధ్య సహకారం పెరగనుంది.

ఇక ఆస్ట్రేలియా ఆహ్వానంపై మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఏపీకి అంతర్జాతీయ వేదికపై గౌరవం రావడం గర్వకారణమని, ఈ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి దిశగా మలచుకుంటానని తెలిపారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ, ఉద్యోగావకాశాలు, ఐటీ పెట్టుబడులు, ఆక్వాకల్చర్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు తెరవడానికి ఈ పర్యటన దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+