ఆ విషయంలో నారా లోకేశ్ స్పష్టత ఇవ్వాలి: విష్ణుకుమార్ రాజు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ సొంతంగా పోటీ చేసి గెలుస్తుందా? లేక మిత్రపక్షం అయిన బీజేపీతో కలసి పోటీ చేసి విజయం సాధిస్తుందా? అనే విషయమై మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ ఏ విధంగానైతే బలపడాలని కోరుకుంటోందో, అదే విధంగా బీజేపీ కూడా కోరుకుంటోందని అన్నారు. బీజేపీ కూడా రాష్ట్రంలోని 175 స్థానాల్లో బలపడాలని కోరుకుంటోందని, రాష్ట్రంలోనూ తమ పార్టీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తామని అన్నారు.

Minister Nara Lokesh should give clarity on this: BJP MLA Vishnu Kumar Raju

ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని టీడీపీ చెప్పడం ద్వారా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగడం లేదనే విషయం ఒకటి స్పష్టమైందని ఓ ప్రశ్నకు సమాధానంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In 2019 Elections, Whether TDP is going to contest for 175 seats on it's own? or It is going to associate with BJP? Asked BJP MLA Vishnu Kumar Raju. While talking to media on Wednesday Vishnu Kumar Raju told that TDP Minister Nara Lokesh should give clarity on this issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి