మందులు లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్!
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపైన రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను అవమానించిన వారు చరిత్రలో కలిసి పోవడం ఖాయమని మండిపడ్డారు. అమరావతి దేవతల రాజధాని కాదు అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.
అమరావతి మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు: నారా లోకేష్
అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి మీడియాలో వచ్చిన వార్తలపైన ఎక్స్ వేదికగా స్పందించిన నారా లోకేష్ రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరికలు జారీ చేశారు.మహిళలను ఇంత ఘోరంగా అవమానిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. అమరావతి ముమ్మాటికి దేవతల రాజధానినే అంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి మహిళలను ఇంత దారుణంగా అవమానిస్తారా అంటూ టార్గెట్ చేశారు.

జగన్ దిగజారుడు తనానికి ఇది నిదర్శనం
జగన్ తన మీడియా సాక్షిగా మహిళలను ఘోరంగా అవమానించారని, ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. అమరావతిపై విషం చిమ్మాలి అనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్ లోనే పడుతుందని ఆయన తేల్చి చెప్పారు. సాక్షి ఛానల్ లో చర్చ కార్యక్రమంలో ఓ వ్యక్తి అమరావతి మహిళలపైన అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పైన నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ పతనానికి ఇది పరాకాష్ట
సోషల్ మీడియాలో స్పందించిన ఆయన తల్లుల ఆత్మ గౌరవాన్ని, అమరావతిని ద్వేషిస్తూ మీరు చేస్తున్న అసత్య ప్రచారం మీ పతనానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. ఆకాశం మీద ఉమ్మి వెయ్యాలని ప్రయత్నిస్తే, అది మీ ముఖం మీద పడుతుందని తేల్చి చెప్పారు. అమరావతిపై విషం చిమ్మాలని చూస్తే అది తిరిగి మీ తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జగన్ అనే సైతానును తరిమికొట్టిన ప్రాంతం అమరావతి
భూములు త్యాగం చేసిన తల్లుల అమరావతిపై మూడు రాజధానుల పేరుతో కుట్రలు చేస్తుంటే, జై అమరావతి అని నినదించిన శాంత మూర్తుల పవిత్ర స్థలం మన రాజధాని జగన్ అనే సైతానును తరిమికొట్టిన అన్ని మతాల దేవుళ్ళు దేవతలు కొలువైన ప్రాంతం అమరావతి అని పేర్కొన్నారు. కన్నతల్లిని సొంత చెల్లిని ఇంటి నుంచి పంపించేసిన దుర్మార్గుడు కి మహిళల త్యాగాలు వారి గొప్పతనం ఎలా అర్థమవుతాయి అంటూ లోకేష్ ప్రశ్నించారు.
మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను వేధించినా చంద్రబాబు ఊరుకోరు
ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల భద్రత గౌరవం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు అంటూ లోకేష్ గుర్తు చేశారు. అంతేకాదు మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను వేధించిన వ్యాఖ్యలకు పాల్పడిన వారికి అదే ఆఖరి రోజు అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు హెచ్చరించారని గుర్తు చేశారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించడం నేర్పిస్తున్న మహిళల ఆత్మవిశ్వాసం దెబ్బ తినేలా మాట్లాడిన వారిని చట్టప్రకారం శిక్షిస్తున్నావు అని తెలిపారు.
జగన్ రెడ్డి గారి బృందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు
అమరావతిపై విషం చిమ్ముతున్న మహిళా లోకాన్ని కించపరుస్తున్న జగన్ రెడ్డి గారి బృందాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర మహిళలను అవమాన పరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు తక్షణమే బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలను హింసించే మందులు లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయరోగాన్ని పూర్తిగా నయం చేస్తామని దేవతల రాజధాని అమరావతి దయ్యం లాంటి జగన్ కు తగిన శాస్తి చేస్తుందని లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications