22న సింగపూర్‌కు లోకేష్‌: ఫ్యామిలీతో ప్రైవేట్ పర్యటన

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. వ్యక్తిగత పనులపై కుటుంబంతో కలిసి ఆయన సింగపూర్‌ వెళ్తున్నారు.

ఈ మేరకు కుటుంబంతో కలిసి పర్యటనకు అనుమతిని మంజూరు చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యటన మంత్రి వ్యక్తిగతం కావడంతో ప్రోటోకాల్‌ సహా ఇతర అంశాలన్నీ స్వయంగా చూసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Andhra Pradesh minister Nara Lokesh will visit Singapore with his family from September 22-26th.

ఇది ఇలా ఉండగా, దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరంతరం నీటి సరఫరాపై అధ్యయనంతో అంతర్జాతీయ సర్టిఫికెట్‌ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ జె నివాస్‌ ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 2 వరకు ఆయన జెరూసలేం, టెల్‌ అవీవ్‌ నగరాల్లో పర్యటించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Nara Lokesh will visit Singapore with his family from September 22-26th.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X