శ్రీలక్ష్మి ఎపిసోడ్ లో కీలక పరిణామం - చంద్రబాబు వాట్ నెక్స్ట్..!!
ఏపీలో అధికార ప్రక్షాళన ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన టీంను సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్య విభాగాల బాధ్యతల్లో ఎవరికి ఏ శాఖ అప్పగించాలనే అంశం పైన ఒక స్పష్టత కు వచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల పైన కసరత్తు చేస్తున్నారు. జగన్ కు పూర్తిగా మద్దతుగా నిలిచిన కొందరు అధికారుల విషయంలో చంద్రబాబు కఠినంగా కనిపిస్తున్నారు. అదే సమయంలో ఐఏఎస్ శ్రీలక్ష్మీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
శ్రీలక్ష్మిక చేదు అనుభవం
ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత ఐఐఎస్ శ్రీలక్ష్మీని కేంద్ర డీఓపీటీ ఏపీకి కేటాయించింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో శ్రీలక్ష్మీ సైతం ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం అదే హోదాలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలో ముఖ్య అధికారులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఆ సమయంలో చంద్రబాబుకు శ్రీలక్ష్మీ బొకేతో శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రయత్నించగా..ఆయన తిరస్కరించారు. ఆ వీడియో వైరల్ అయింది.

చంద్రబాబు కఠిన వైఖరి
అదే విధంగా జగన్ హయాంలో నిఘా చీఫ్ గా పని చేసిన పీఎస్సార్ ఆంజనేయులను కలవటానికి చంద్రబాబు ఇష్టపడలేదు. ఈ ఇద్దరితో పాటుగా మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు నిబంధనలకు విరుద్దంగా జగన్ కు సహకరించారనేది టీడీపీ నేతల అభియోగం. ఇక, పురపాలక శాఖా మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో శ్రీలక్ష్మి ఒక ఫైల్ ను సంతకం చేసేందుకు నారాయణకు ఇవ్వగా..ఆయన తిరస్కరించారు. ఇలా వరుసగా కొత్త ప్రభుత్వంలో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
శ్రీలక్ష్మీకి దక్కే పోస్టు
ఇక..చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత అయిదు సంతకాలు చేసారు. అందులో అన్నా క్యాంటీన్లకు సంబంధించిన జీవో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీలక్ష్మీ జారీ చేయాల్సి ఉంది. కానీ, శ్రీలక్ష్మీ పేరుతో జీవోలు విడుదల కాకూడదని స్ఫష్టం చేసినట్లు సమాచారం. ఫలితంగా సీఎస్ పేరుతో జీవోలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బదిలీల పైన కసరత్తు జరుగుతుండటంతో శ్రీలక్ష్మి కి పోస్టింగ్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications