ఆ 43వేల కోట్లు ప్రజలకే..: జగన్‌పై నారాయణ, బాబుపై పరిటాల ప్రశంసలు

Subscribe to Oneindia Telugu

చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్‌ మీడియా లేనిపోని దుష్ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమరావతిలో పరిపాలన భవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే నాణ్యతతో నిర్మిస్తుంటే.. కూలిపోతున్నాయంటూ జగన్‌ మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైయస్సార్ కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు.

narayana-sunitha

జగన్‌కు చెందిన రూ.43వేల కోట్ల ఆస్తులను.. అక్రమాస్తులుగా ఈడీ గుర్తించిందని చెప్పారు. ఆ ఆస్తులన్నింటినీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా పంచాలని మంత్రి నారాయణ డిమాండ్‌ చేశారు.

దేశంలోనే చంద్రబాబు నెంబర్ వన్ నేత: పరిటాల సునీత

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ నేతలు, ఆయన కేబినెట్‌లోని మంత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దటూరులో ఆదివారం జరిగిన రంజాన్ తోఫా పంపిణీకి హాజరైన ఆ పార్టీ సీనియర్ నేత, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశంలోనే చంద్రబాబు నెంబర్ వన్ నేతగా ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా హామీ ఇవ్వని హామీలను కూడా చంద్రబాబు అమలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏపీలో ఏ ఒక్క సీఎంకు కూడా రాని కొత్త ఆలోచనలు చంద్రబాబుకు వస్తున్నాయని కూడా ఆమె అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Minister Narayana fired at YSR Congress party president Jaganmohan Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి