అమరావతి కేంద్రంగా ఢిల్లీ కీలక నిర్ణయం, నెక్స్ట్ ఇక..!!

ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైంది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విభజన చట్టంలోని 5(2)కి సవరణ చేసేందుకు కొద్దిరోజుల కిందటే కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదముద్ర లభించింది. ఎంతో కాలంగా అమరావతి రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ప్రభుత్వం తాజాగా ఆమోదించిన రెండో విడత లాండ్ పూలింగ్ మొదలైంది. ఈ సమయంలో రైతులకు ప్రభుత్వం కీలక హామీలు ఇస్తోంది.

అమరావతికి కేంద్రం అధికారికంగా రాజముద్ర వేసేందుకు రంగం సిద్దం అవుతోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత, త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజపత్రం (గెజిట్‌) విడుదల చేస్తారు. ఇక.. ఇటు అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈరోజు (గురువారం) ప్రారంభమైంది. ఇందులో భాగంగా అమరావతి మండలం యండ్రాయిలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. రెండో విడతలో అమరావతి మండలంలో నాలుగు గ్రామాలకు చెందిన రైతుల నుంచి అధికారులు భూమిని సేకరించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో రాజధాని నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.

minister-narayana-key-assurances-for-amaravati-farmers-amid-second-phase-land-pooling

అంతర్జాతీయ రాజధాని నిర్మాణంలో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని అన్నారు. రెండో విడతలో రైతులు ఇచ్చే 7000 పైగా ఎకరాల భూముల్లో 2500 ఎకరాలలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. గతంలో భూ సమీకరణ సమయంలో రాజధాని రైతుల విషయంలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్పారు. ట్రంకు రోడ్లు, ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని వివరించారు. నాలుగు, ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని.. ఇక్కడ కూడా ఏడాది కాలంలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+