ప్రజల్లో పవన్ కళ్యాణ్ విశ్వాసం కోల్పోయారు: మంత్రి నారాయణ ప్రశ్నల వర్షం

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు గందరగోళం సృష్టిస్తున్నాయని మంత్రి నారాయణ మంగళవారం అన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతుంటే పవన్ విజయవాడలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని, ఈ విషయం పవన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. పవన్‌ రోజుకో రకంగా మాట్లాడుతున్నారని, హోదా ఇస్తామని తిరుపతిలో మోడీ చెప్పలేదా అని నిలదీశారు.

Minister Narayana questions on Pawan Kalyan

ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని మోడీ అనలేదా అన్నారు.
ఇవన్నీ పవన్‌‌కు తెలియవా అని ప్రశ్నల వర్షం గుప్పించారు. ఎవరో చెప్పారని, కలలో వచ్చిందని పవన్‌ మాట్లాడటం సరికాదన్నారు.

పోలవరంపై పవన్‌ కళ్యాణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అతను ప్రజల్లో విశ్వాసం కోల్పోయారన్నారు. ప్రజల్లో టీడీపీ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని, లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గట్టెక్కిస్తున్నారన్నారు.

అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. కేవలం పరిపాలనా నగరానికి మాత్రమే నిధులు కోరుతున్నామన్నారు. అంచనాల ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ను నోటిఫై చేసి ప్రజల సలహాలు తీసుకున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+