మంత్రి నారాయణ కుమారుడి మృతదేహం నెల్లూరుకు తరలింపు, రేపు అంత్యక్రియలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరు తరలించారు. అపోలో ఆస్పత్రిలో నిశిత్ మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతదేహాన్ని స్వస్థలం నెల్లూరు తరలించారు. అపోలో ఆస్పత్రిలో నిశిత్ మృతదేహానికి వైద్యులు శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
అనంతరం అంబులెన్స్‌లో బంధువులు మృతదేహాన్ని నెల్లూరుకు తరలించారు. నిశిత్ తండ్రి నారాయణ లండన్ నుంచి బయలుదేరారని.. ఈ రాత్రికి చెన్నైకి చేరుకుంటారని వారి బంధువులు చెబుతున్నారు.

ఏపీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్‌రావు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సీపీఐ నేత నారాయణ, తెరాస నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.శ్రీనివాస్, తెలంగాణ తెదేపా నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎల్.రమణ తదితరులు అపోలో ఆస్పత్రిలో నిషిత్ మృతదేహానికి నివాళులర్పించారు.
బుధవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ(22), అతడి స్నేహితుడు రవివర్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రయాణిస్తున్న బెంజ్ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నిశిత్ అంత్యక్రియలు గురువారం నెల్లూరులోని నారాయణ కళాశాల క్యాంపస్‌లో నిర్వహించనున్నట్లు చెబుతున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications