అమరావతిలో అందరికీ అపార్టుమెంట్లు, ఇలా: 15 సంస్థలకు భూములు, ఉచితంగా కూడా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా మరిన్ని సంస్థలకు భూమి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సంస్థల కార్యకలాపాలను బట్టి లీజుకు, ఉచితంగా, నామమాత్రపు ధర, మార్కెట్‌ ధరలకు ఇస్తున్నట్లు చెప్పారు.

అందులో భాగంగానే 217 చ.కి. విస్తీర్ణంలో 15 సంస్థలకు 152.93 ఎకరాల భూ కేటాయింపులు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇండో-అమెరికన్‌ ఆసుపత్రి నిర్మాణం త్వరలో మొదలుపెట్టి 2018 నాటికి ప్రారంభిస్తామన్నారు.

అందరికీ అపార్టుమెంట్ల నిర్మాణం

అందరికీ అపార్టుమెంట్ల నిర్మాణం

శాసనసభ్యులు, ఐఏఎస్‌, గెజిటెడ్‌ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులకు అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని, అందులో 4,500 ఫ్లాట్లు ఉంటాయని వివరించారు. ఈపీసీ విధానంలో నిర్మించే వీటికి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు.

పది రకాల అపార్టుమెంట్ డిజైన్లు ఇచ్చిన ఆర్కాప్

పది రకాల అపార్టుమెంట్ డిజైన్లు ఇచ్చిన ఆర్కాప్

భవనాల డిజైన్లు ఆమోదించాల్సి ఉందని నారాయణ చెప్పారు. ఆర్కాప్‌ అనే సంస్థ పది రకాల అపార్ట్‌మెంట్ల ఆకృతులు రూపొందించగా వీటిపై చర్చించినట్లు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి, మంత్రులకు మరోసారి చూపి తుది డిజైన్లు ఖరారు చేస్తారన్నారు.

ఎక్కడా నిర్మించని విధంగా ఏపీలో పేదలకు ఇళ్లు

ఎక్కడా నిర్మించని విధంగా ఏపీలో పేదలకు ఇళ్లు

పేదలకు నిర్మించే ఇళ్లు అన్ని హంగులతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని నారాయణ చెప్పారు. వర్టిఫైడ్‌ టైల్స్‌తో ఇళ్లను దేశంలో ఎక్కడా పేదలకు నిర్మించలేదని, తొలిసారిగా ఏపీలో అలా చేస్తున్నామన్నారు. రేకు, సిమెంటు అచ్చులతో కూడిన తలుపులు ఏర్పాటు చేస్తే ఖర్చు తగ్గుతుందన్నారు.

 అపార్టుమెంట్ల తరహాలోనే

అపార్టుమెంట్ల తరహాలోనే

ఖరీదైన అపార్టుమెంట్ల తరహాలోనే కలపతో కూడిన తలుపులు, ఇతర సామగ్రి అమరుస్తున్నామని నారాయణ చెప్పారు. భూకంపం వచ్చినా తట్టుకునే విధంగా భవన నిర్మాణాలు ఉంటాయని, పదిహేను నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వచ్చే ఏడాది జనవరి 15 నాటికి గృహప్రవేశం జరిగేలా కార్యాచరణ రూపొందించామన్నారు.

 టెండర్ల ప్రక్రియ పూర్తి

టెండర్ల ప్రక్రియ పూర్తి

రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేలు, అధికారులు, ఉద్యోగులకు గృహసముదాయాల నిర్మాణ డిజైన్లు సిద్ధమయ్యాయని నారాయణ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లు, గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం 4,500 అపార్ట్‌మెంట్లను నిర్మించనన్నట్లు తెలిపారు. ఈపీసీ మోడల్‌లో టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు.

భూకేటాయింపులు ఇలా..

భూకేటాయింపులు ఇలా..

అంబేద్కర్‌ స్మృతివనంకు 20 ఎకరాలు, హెచ్‌పీసీఎల్‌‌కు అర ఎకరం, కాగ్‌ కార్యాలయంకు 17ఎకరాల భూమి, 60ఏళ్లు లీజుకు,

రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌‌కు 3 ఎకరాలు, న్యూఇండియా అస్యూరెన్స్‌ కంపెనీకి 1.93 ఎకరాలు, సిండికేట్‌ బ్యాంకుకు 1.3 ఎకరాలు, ఎపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి 5 ఎకరాలు, రాష్ట్ర సహకార బ్యాంకుకు 4 ఎకరాలు, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి 15 ఎకరాలు, జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌‌కు 50 ఎకరాలు, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌‌కు 12 ఎకరాలు,
గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి 12 ఎకరాలు, బ్రహ్మకుమారి సొసైటీకి 10 ఎకరాలు, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌‌కు 1000 చ.గ., రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌(రైట్స్‌)కు ఒక ఎకరం ఉచితంగా ఇవ్వనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Minister Narayana talks about Amaravati buildings.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి