తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్.. అకౌంట్లలో రూ.15 వేలు

ఏపీలోని ఎన్డీఏ సర్కార్ ప్రజలకు వరుస శుభవార్తలను అందిస్తోంది. ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీల అమలుకు శ్రీకారం చూట్టింది. ఇప్పటికే మెగా డీఎస్సీ, పెన్షన్లు పెంపు వంటి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం జరిగింది.ఇప్పటికే బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు.

దీని తర్వాత ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందించబోతున్నామని ప్రకటించినప్పటికి , దానిపై విధివిధానాలు పూర్తి కాకపోవడంతో ఈ హామీ అమలు వాయిదా వేయడం జరిగింది. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చూట్టబోతోంది. మహిళలకు నెలకు రూ.1500 ఇచ్చే పథాకాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనికి కావాల్సిన అర్హతలు త్వరలోనే విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది.

Minister Nimmala Ramanaidu key announcement on talliki vandanam scheme

ఆ హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. సెప్టెంబర్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా తల్లికి వందనం పథకం అమలుపై కూడా మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో స్కూల్ కు వెళ్తున్న ప్రతి విద్యార్థినికి రూ.15 వేలు త్వరలోనే వారి అకౌంట్లలో జమ చేస్తామని వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన నిమ్మల.. అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొకటిగా నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+