దమ్ముంటే చంద్రబాబు .. పుంగనూరులో ఆ పని చెయ్ .. మంత్రి పెద్దిరెడ్డి సవాల్
కుప్పం నియోజకవర్గంలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలలో ఓటమి తర్వాత మూడు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వేధింపులకు గురి చేస్తే పుంగనూరు నేత ఉండేవాడా అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని టార్గెట్ చేసి విమర్శించిన చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

దమ్ముంటే పుంగనూరు లో పోటీ చేయాలని సవాల్
కుప్పంలో ఓటమిపాలైన చంద్రబాబుకు కనువిప్పు కలగలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే పుంగనూరు లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కుప్పంలో ఓటమిపాలైన చంద్రబాబుకు తీవ్ర అసహనం పెరిగిపోయింది అని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చంద్రబాబు ఒక్కసారి కూడా కుప్పం నియోజకవర్గం వైపు చూడలేదని, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యే సరికి కుప్పం ప్రజలు గుర్తుకు వచ్చారని విమర్శించారు.

పులివెందులకు, పుంగనూరుకు వచ్చి చంద్రబాబు ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్న
కరోనా కష్టకాలంలో కూడా కుప్పం ప్రజల పరిస్థితి తెలుసుకోలేదని చంద్రబాబుకు కుప్పంలో తిరిగి అర్హత లేదన్నారు. పులివెందులకు, పుంగనూరుకు వచ్చి చంద్రబాబు ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు గతంలో అక్రమంగా మిథున్ రెడ్డి ని 15 రోజుల పాటు జైల్లో పెట్టించారని విమర్శించారు. గతంలో చంద్రబాబు అమలు చేసిన పథకాలు వాళ్ళ అబ్బ సొమ్ముతో అమలు చేశాడా అంటూ ప్రశ్నించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

చంద్రబాబు కుప్పం పర్యటన టార్గెట్ గా వైసీపీ మంత్రుల ఆగ్రహం
రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చేస్తున్నారంటూ కితాబిచ్చారు. అందుకే ప్రజలు జగన్ పాలన కు పట్టం కడుతున్నారని, చంద్రబాబును ఛీ కొడుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తూ చిత్తూరు జిల్లా వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపధ్యంలో చంద్రబాబుపై ఎదురు దాడికి దిగుతున్నారు వైసీపీ నేతలు .
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications