జగన్ చెప్పారంటే చేస్తారంతే ... ఏపీ సీఎం కు మంత్రి పేర్ని నానీ, ఎంపీ విజయసాయిరెడ్డి కితాబు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కితాబిచ్చారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా జగన్ దార్శినికతపై ప్రశంసల జల్లు కురిపించారు . జగన్ రాష్ట్రంలో సంచలన నిర్ణయాలు తీసుకుని పేదల కష్టాలు తీరుస్తున్నారని పేర్కొన్నారు . ప్రజాసమస్యలు తీర్చడం కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టి వాటి అమలు బాటలో ముందుకు సాగుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలు చూశారని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

నిరుపేదల కల నిజం చేస్తారు : పేర్ని నానీ
ఇప్పటికే దశల వారీగా మద్యం షాపులను తగ్గించారని, రాబోయే కాలంలో పూర్తిగా వచ్చే షాపులను నిర్మూలన చేస్తారని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మద్యానికి బానిసలైన కుటుంబాల పిల్లలు కార్మికులుగా పని చేస్తున్నారని, చిన్నారుల బాల్యం బుగ్గి పాలు కాకుండా, దానిని అధిగమించడం కోసమే అమ్మ ఒడి పథకాన్ని అందిస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్నారంటూ నాని కితాబిచ్చారు.

జగన్ చెప్పారంటే .. చేస్తారంతే : నానీ పొగడ్త
సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారంటే చేస్తారంతే అంటూ పేర్ని నాని జగన్ మాట తప్పని నేత అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల లో 95 శాతం అమలు చేశారని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు . రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒక పండుగలాగా కొనసాగుతుందని పేర్కొన్న పేర్ని నాని, ఇల్లులేని వారు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోనే ఇల్లు కట్టించి ఇస్తామంటూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం అంటే మామూలు విషయం కాదని, అది సీఎం జగన్ మోహన్ రెడ్డి చూపించారని పేర్ని నాని పేర్కొన్నారు.

జగన్ దార్శనికతను దేశమంతా కొనియాడుతోంది: విజయసాయి
వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా సీఎం జగన్ కు కితాబిచ్చారు ఆంధ్రప్రదేశ్లో పక్కా గృహాల నిర్మాణం పూర్తయితే ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆస్తి సొంతమవుతుందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు . ఇళ్ల పట్టాల పంపిణీ తో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతను దేశమంతా కొనియాడుతోంది అన్నారు . శాశ్వత చిరునామా అంటూ లేని 30 లక్షల కుటుంబాలకు ఇంత భారీ స్థాయిలో ఉచితంగా స్థలాలు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications