నంద్యాలలోనే జగన్ బట్టలూడదీశారు, కాకినాడలోనూ అంతే: ప్రత్తిపాటి సెటైర్లు

నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సీఎం చంద్రబాబునాయుడు మూడేళ్ల కష్టానికి నిదర్శనమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

విజయవాడ: నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ విజయం సీఎం చంద్రబాబునాయుడు మూడేళ్ల కష్టానికి నిదర్శనమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. నంద్యాల ఓటమి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడిందని అన్నారు.

నంద్యాలలో ఓటర్లే జగన్ బట్టలూడదీశారని అన్నారు. కాకినాడలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అందుకే ఆ పార్టీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కకునే పనిలో పడ్డారని ఎద్దేవా చేశారు.

minister Prathipati pulla rao lashes out at YS Jagan

కాకినాడ పురపాలక ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింగిల్ డిజిట్ ఫలితమే రాబోతుందని అన్నారు. 20ఏళ్ల తర్వాత కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగురవేయబోతున్నామని మంత్రి ప్రతిపాటి ధీమా వ్యక్తం చేశారు.

కాకినాడ పురపాలక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి 30-40 స్థానాలు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+