ఎన్టీఆర్‌పై కోడెల, అభివృద్ధిలోకి గ్రామాలు: రావెల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధిలోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఆదివారం నాడు గుంటూరులోని వెంగళాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్వవస్ధాపకులు ఎన్టీఆర్ వర్ధంతిలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వీటితో పాటు ఇంటర్నెట్, వైఫై లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటామన్నారు.

ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన సభాపతి కోడెల
గుంటూరు జిల్లా కొనకంచివారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని అంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్. కోడెల శివప్రసాదరావు ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాడి ఆత్మాభిమాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
గ్రామంలో రూ. 13 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications