రజినీకాంత్‌పై వ్యాఖ్యలకు రోజా వివరణ: చంద్రబాబుకు ఐటీ నోటీసులపై పవన్‌కు సవాల్
హైదరాబాద్/అమరావతి: సూపర్ స్టార్ రజినీకాంత్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పష్టతనిచ్చారు ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు(NTR) శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు రజినీకాంత్. అంతేగాక, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనపైనా ప్రశంసలు కురిపించారు. దీంతో వైసీపీ నేతలు, మంత్రులు ఆ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి రోజా కూడా ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.

రజినీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు చేశారు. రజినీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారన్నారు. ఎన్టీఆర్ ఏమన్నారో.. రజినీకాంత్‌కు వీడియోలు పంపిస్తానని చెప్పారు. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
రజినీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు.
ఎన్టీఆర్ అభిమానులను బాధపెట్టేలా రజినీకాంత్ మాట్లాడారంటూ రోజా మండిపడ్డారు. ఈ క్రమంలో రజినీకాంత్ అభిమానులు.. రోజాను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శల దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో సోమవారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. రజినీకాంత్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు.
రజినీకాంత్, ఆయన వ్యాఖ్యలపై తాను విమర్శలు చేయలేదని.. ఖండించానని స్పష్టం చేశారు రోజా. రజినీకాంత్ ఎవరినో ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది సరికాదన్నారు. మరోవైపు, చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఆమె విమర్శలు గుప్పించారు.
పాదయాత్ర చేస్తూ లోకేష్ ఇష్టమొచ్చినట్లు మొరుగుతున్నారని రోజా మండిపడ్డారు. పవన్ కళ్యాన్ షూటింగ్ గ్యాప్ లో చంద్రబాబు ప్యాకేజీని తీసుకుని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో అక్రమాలకు పాల్పడిన డబ్బులను బ్రాహ్మణి, భువనేశ్వరి లెక్కల్లో పెట్టారని ఆరోపించారు.
చంద్రబాబు, లోకేష్‌ను విచారించి అరెస్ట్ చేయాలన్నారు.

అమరావతి పేరుతో దుచుకున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. తాజాగా, ఐటీ సోదాలతో చంద్రబాబు దోపిడీ బయటపడిందన్నారు. రూ. 118 కోట్లు దోపిడీపై లెక్క చెప్పాలన్నారు. ఐటీని నేనే కనిపెట్టానంటూన్న చంద్రబాబు.. ఐటీ నోటీసులపై స్పందించాలని డిమాండ్ చేశారు. దొంగ సంస్థలు ఏర్పాటు చేసి దోచుకున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు రోజా.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications