చంద్రబాబు కోసం పవన్ లాబీయింగ్ మామూలుగా లేదు: మంత్రి రోజా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్టీఏ కూటమి సమావేశంలో పాల్గొని తాజాగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కోసం పవన్ ఢిల్లీలో దళారీ గా మారారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ దళపతి కాదు దళారి అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన కార్యకర్తలకు, కాపులకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. పొత్తులు పెట్టుకోవటానికి కొత్త పార్టీలు లేక పవన్ కళ్యాణ్ మళ్ళీ టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకున్నాడని మంత్రి రోజా వెల్లడించారు. సిగ్గు లేకుండా మూడు పార్టీలతో కలిసి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నాడని పవన్ కళ్యాణ్ ను ఎద్దేవా చేశారు.

తన తల్లిని తిట్టిన వాడి కోసం పవన్ కళ్యాణ్ దళారిగా మారడం సిగ్గుచేటని మంత్రి రోజా విమర్శించారు. ప్రధాని మోదీని తిట్టిన చంద్రబాబును ఎన్డీఏ సమావేశానికి పిలవలేదని గుర్తు చేసిన రోజా, కానీ తన తల్లిని తిట్టిన చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ మీడియా ముందు హీరో రాజకీయాల్లో జీరో అని మంత్రి రోజా పేర్కొన్నారు.
సిగ్గు లేకుండా చంద్రబాబు కోసం అందరి కాళ్లు పవన్ కళ్యాణ్ పట్టుకుంటున్నాడు అని మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని, గొంతు కోసుకుంటా అని చెప్పాడని, కానీ ఇప్పుడేమో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తానని చెబుతున్నాడని మండిపడ్డారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానన్న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేశాడని మంత్రి రోజా పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని లేఖలు రాసిన ఎన్డీఏ సమావేశానికి ఆయనను పిలవలేదని పేర్కొన్న రోజా చంద్రబాబు ఊసరవెల్లి లాంటి వాడని బిజెపి కి బాగా తెలుసని మంత్రి రోజా తెలిపారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం పాకులాడడం సిగ్గుచేటని రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications