నారా బ్రాహ్మణి గురించి మాట్లాడే అర్హత మంత్రి రోజాకు లేదు!!

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటుగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై టిడిపి నగరి ఇన్చార్జ్ గాలి భాను ప్రకాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నారా బ్రాహ్మణి గురించి మాట్లాడే కనీస అర్హత రోజాకు లేరని లేదన్నారు. ఆమెకు నోరు పారేసుకోవడం అలవాటని మండిపడ్డారు.

మంత్రి రోజా నోరు డ్రైనేజీ అని, ఆమె 2014లో అద్దె ఇంట్లో ఉండే వారని, ఇప్పుడు బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై ఇలా ప్రతి ఊర్లో ఒక ఇల్లు కొన్నారని, ఈ డబ్బులు అన్నీ ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం చంద్రబాబుని అరెస్ట్ చేశారన్నారు.

Roja has no right to talk about Nara Brahmani

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, వైసిపి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం నారా లోకేష్ ప్రయత్నం చేసింది లేదని, మీడియా, లీగల్ టీం తో చర్చించడం కోసమే వెళ్లారని భాను ప్రకాష్ పేర్కొన్నారు. అసలు డబ్బు బదలాయింపు లేని దాన్ని స్కామ్ అని ఎలా అంటారు అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రానికి అన్యాయం చేయడానికి కెసిఆర్ జగన్ ను పావుగా వాడుకుంటున్నారన్నారు. ఇదేసమయంలో టిడిపి ఉద్యోగులకు పాదిరెడు వద్ద ఇచ్చిన ప్లాట్లు పెద్ద స్కామ్ అని ఆరోపించిన ఆయన దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. కాగా ఇటీవల నారా బ్రాహ్మణి స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఎటువంటి అవినీతి జరగలేదని సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ పేర్కొన్నారని చేసిన ట్వీట్ కు రోజా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

చంద్రబాబు చేసిన ఆర్థిక మోసాన్ని సమర్థించడానికి బ్రాహ్మణి, ఆమె కుటుంబ సభ్యులు ఎల్లో మీడియా ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని రోజా పేర్కొన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమౌతోందని రోజా అన్నారు. చంద్రబాబు అండ్ కో వందలాది కోట్ల రూపాయల మేర ప్రజా ధనాన్ని దోచుకున్నారనేది ఆధారాలతో సహా తేలిందని మంత్రి రోజా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+