అదే మన లక్ష్యం - వాళ్లను పట్టిచుకోబోం : ఆత్మకూరులో రోజా..!!

ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచార బరిలోకి దిగిన మంత్రి రోజా పలు ప్రాంతాల్లో పర్యటించారు. నియెజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ ఉప ఎన్నికలో పార్టీ శ్రేణులంతా ఒకటే లక్ష్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక ప్రచారం ..సమన్వయం కోసం మండలాల వారీగా మంత్రులు - సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా.. చేజెర్ల మండలంలోని పాతపాడు, ఓబులాయపల్లి, కొండలరాయుడు కండ్రిక, గొల్లపల్లి గ్రామాల్లో రోజా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

గౌతమ్‌రెడ్డిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. మేకపాటి విక్రమ్‌రెడ్డి సాధించే మెజార్టీ చరిత్రలో నిలిచిపోయేలా ప్రజలు తీర్పు వెలువరించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ.1.40 లక్షల కోట్లు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని చెప్పారు. గతంలో అధికారంలో ఉండి ప్రజల కోసం ఆలోచన చేయని వాళ్లు ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని దుయ్య బట్టారు.

Minister Roja appealed Atmakur voters to give huge majority for YCP candidate Vikram Reddy

అదే సమయంలో నామ మాత్రంగా పార్టీ నడుపుతున్న వాళ్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారని..వారిని తాము పట్టించుకోమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం..ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి - సంక్షేమం గుర్తు చేసుకుంటే ఎవరు ప్రజల కోసం ఏం చేసారో అర్దం అవుతుందని వివరించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలో ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకుందన్నారు ఆత్మకూరు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో..మంత్రిగా రాష్ట్రానికి గౌతమ్ రెడ్డి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమంటూ చెప్పుకొచ్చారు.

ఈ ఉప ఎన్నికల్లో గౌతమ్ సోదరుడు విక్రమ్ ను లక్ష మెజార్టీతో గెలిపించాలని రోజా తన ఎన్నికల ప్రచారంలో అభ్యర్దించారు. చేజర్ల మండలం బాధ్యతలను రోజా తో పాటుగా మాజీ మంత్రి కొడాలి నానికి కేటాయించారు. అటు బీజేపీ సైతం ప్రచారం కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రులు తమకు కేటాయించిన మండలాల్లో ప్రచారంలో నిమగ్నమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+