Roja Vs NBK బాలకృష్ణ అప్పుడు మీసాలు తిప్పి ఉంటే - మంత్రి రోజా..!!
ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాల ప్రారంభంలోనే ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ మీసం తిప్పటంతో ఒక్క సారిగా సభలో సీన్ మారిపోయింది. మంత్రి అంబటి వర్సస్ బాలయ్య(Balakrishna) మధ్య డైలాగ్ వార్ నడిచింది. వైసీపీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి తొడ గొట్టారు. దీంతో, సభలో గందరగోళం కొనసాగింది.
బాలకృష్ణ కు హెచ్చరిక : సభలో బాలకృష్ణ మీసం తిప్పటం పైన స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తొలి తప్పుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ..క్షమిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులను ఈ సమావేశాల(AP Assembly) చివరి వరకు...మిగిలిన వారిని ఈ రోజు వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. ఇక, బాలకృష్ణ పైన మంత్రి రోజా(Minister Roja) కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభలో గూండాల్లా, సైకోల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. స్పీకర్ చైర్ మీద గౌరవం లేకుండా స్పీకర్ చుట్టూ చేరి పేపర్లు చింపేసి మొహం మీద విసిరేశారని ఫైర్ అయ్యారు. స్పీకర్ ముందున్న మానిటర్, మంచినీటి గ్లాస్ పగులగొట్టి.. అరుస్తూ సభా సంప్రదాయాన్ని గౌరవించకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

బాలయ్య వర్సస్ రోజా : శాసనసభ సమావేశాలను బాలకృష్ణ(Balakrishna) షూటింగ్ అనుకుంటున్నారా అంటూ.. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతున్నాడన్నారని రోజా మండిపడ్డారు. ఏరోజూ ప్రజా సమస్యలపై ప్రస్తావించని బాలకృష్ణ.. బావ కళ్లలో ఆనందం చూడటానికి అసెంబ్లీకి వచ్చినట్టున్నాడన్నారని ఎద్దేవా చేసారు. తండ్రి ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినప్పుడు చంద్రబాబుపై బాలకృష్ణ మీసాలు తిప్పి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవారని రోజా వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సాక్షాధారాలతో అడ్డంగా దొరికిపోతే కోర్టు జైలుకు పంపించారని చెప్పుకొచ్చారు. తప్పు చేసినవారు ఎవరైనా జైలుకు వెళ్తారని కోర్టు, పోలీస్ స్టేషన్ల మీద ప్రజలందరికీ నమ్మకం వచ్చిందని రోజా చెప్పుకొచ్చారు.
స్కాంలో చంద్రబాబు : చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ జరిగిందన్నారు. దాదాపు రూ.241 కోట్లు దోచేసిన దోపిడీదారుడు చంద్రబాబు అని ఆరోపించారు. సాక్ష్యాధారాలతో దొరికాడు కాబట్టే ఆయన్ను రాజమండ్రి జైల్లో పెట్టారని అందరికీ తెలుసని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. అటు టీడీపీ(TDP) నేతలు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా తమను సస్పెండ్ చేసిందని ఆరోపిస్తున్నారు. తాము తమ నాయకుడిపైన పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు రిమాండ్ కు కారణమైన స్కిల్ స్కాం(Skill Scam)లో ఏం జరిగిందనే దాని పైన రేపు (శుక్రవారం) అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేందుకు సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications