షర్మిల పై రోజా సీరియస్ కామెంట్స్..!!
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై మంత్రి ఆర్కే రోజా సీరియస్ కామెంట్స్ చేశారు. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి షర్మిల సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా పైన షర్మిల నిరసనకు సిద్దమయ్యారు. ఈ సమయంలో మంత్రి రోజా స్పందించారు. వైయస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
షర్మిల పై రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. షర్మిల మెడలో కాంగ్రెస్ కండువా వేసుకొని చంద్రబాబు స్క్రిప్టు చదువుతున్నారని ఆరోపించారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా పేర్కొన్నారు. మూడుసార్లు సీఎంగా చేస్తే మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేసారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారని మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చటంతో ప్రారంభించిన చంద్రబాబు నేడు వైయస్ఆర్ కుటుంబం వరకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన షర్మిలది తప్పు అని రోజా చెప్పుకొచ్చారు.

వైయస్ఆర్ కుటుంబం మాట ఇస్తే నిలబడతారు అనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. వైయస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమేసిన నాయకులను అభ్యర్థులుగా పెట్టుకునే పరిస్థితికి దిగజాగారని ఎద్దేవా చేసారు. తెలంగాణ అని పార్టీ పెట్టి, అక్కడ కాంగ్రెస్, టీడీపీ, జనసేన గురించి ఏం చేశారో ప్రజలు గమనించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆంధ్రాలో అబద్ధాలు మొదలు పెట్టారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications