జగన్, షర్మిలకు వైఎస్ ఆస్తుల పంపకాలపై రోజా కీలక వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన జత కట్టాయి. బీజేపీ వైఖరి పైన పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలోనే షర్మిలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా షర్మిలకు జగన్ ఆస్తులు ఇవ్వలేదనే పవన్ వ్యాఖ్యల పైన మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు.

మంత్రి రోజా పీసీసీ చీఫ్ షర్మిల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. షర్మిళ కు రాజకీయ అవగాహన లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు భర్తీ చెయ్యని డీఎస్సీ పోస్టులను జగన్ భర్తీ చేశారన్నారు. 6100 పోస్టుల భర్తీకీ ప్రస్తుతం జగన్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి 17వేల పోస్టులను భర్తీ చేశారు. 6,100 భర్తీలకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడైనా ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నార‌ని రోజా వ్యాఖ్యానించారు.

Minister Roja Seriously reacts over Pawan Kalyan comments on YSR Assets

నాలుగున్నరేళ్లు తెలంగాణ బిడ్డను అని చెప్పుకొని ఇప్పుడు ఏపీ గురించి షర్మిల హడావుడి చేస్తున్నారని రోజా సీరియస్‌ అయ్యారు. నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తాను తెలంగాణ బిడ్డను అని చెప్పుకున్నా రని గుర్తు చేసారు. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి జగన్‌పై విషం చిమ్ముతూ ఆరాటాలు, పోరాటాలు చూసి ప్రజలు నవ్వుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ ఎప్పుడో జగన్, షర్మిళకు ఆస్తులు పంచారని రోజా అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్థిలో అన్నాచెల్లెలు, భార్యలకు ఎంత పంచాడో చెప్పాలన్నారు. పవన్‌ కల్యాణ్‌ కూడా పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమంటూ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+