రాజీకి రమ్మంటున్న రోజా, గాల్లో తిరగమంటున్న రెబల్స్, హ్యాట్రిక్ మీద దెబ్బకొడతామని చాలెంజ్ !

వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, మంత్రి, నగిరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. నగిరిలో హ్యాట్రిక్ కొట్టాలని కలలు కంటున్న మంత్రి రోజాకు స్థానికంగా సినిమా కనపడుతోంది. మంత్రి రోజాకు మేము సహకరించమని, ప్రజల్లోకి వెళ్లి ఆమె తరపున మేము ఎన్నికల ప్రచారం చెయ్యమని నగిరి నియోజక వర్గానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు ఇప్పటికే ఆ పార్టీ హైకమాండ్ కు తేల్చి చెప్పారు.

నగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పుత్తూరు, నగిరి, నిండ్రా, వడమాలపేట, విజయాపురం మండలాలు ఉన్నాయి. ఈ ఐదు మండలాలలోని వైసీపీ నాయకులతో మంత్రి రోజాకు వ్యవహారం దెబ్బ తినింది. ఏరోజు అయితే మంత్రి రోజా రెండో సారి ఎమ్మెల్యే అయ్యారో ఆ రోజు నుంచి ఆమె పద్దతితో తేడాలు వచ్చాయని ఐదు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

Minister Roja started reconciliation talks with YCP rebel leaders in Nagiri

మంత్రి పదవి వచ్చిన తరువాత రోజా భూమి మీద నిలబడటం మానేసి ఆమె గాల్లోకి తిరుగుతోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆమె దయాదాక్షిన్యాలతో మేము బతుకుతున్నట్లు రోజా, ఆమె భర్త ఆర్ కే సెల్వమణి, మంత్రి సోదరుడు కుమారస్వామి రెడ్డి మాట్లాడుతున్నారని, మాకు పరువు మర్యాద ఉందని, ఆమె ఇంటి వైపు కన్నెత్తికూడా చూడమని ఐదు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు ఇప్పటికే తేల్చి చెప్పారు.

ఎవరు వచ్చి తనకు మద్దతు తెలిపినా తెలపకపోయినా, తన వెంట ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఏమాత్రం పట్టించుకోనని, తాను మూడోసారి ఎమ్మెల్యే అవుతానని మంత్రి రోజా ఇన్ని రోజులు ధీమాగా చెప్పారు. తన సినీగ్లామర్ దెబ్బకు ప్రజలు తనను చూడటానికి వస్తారని, పనిలో పనిగా ఎన్నికల ప్రచారం చేస్తారని మంత్రి రోజా పప్పులో కాలేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ సంపాధించుకున్న తరువాత నగిరిలో ఆమెకు సన్నిహితంగా ఉంటున్న వాళ్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

Minister Roja started reconciliation talks with YCP rebel leaders in Nagiri
నగిరి నియోజక వర్గంలో తమిళ ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెలుతున్న మంత్రి రోజా భర్త ఆర్ కే సెల్వమణి వారికి తమిళ వాసన చూపించి వారిని తమ వెంట తిప్పుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. అయితే మంత్రి రోజా అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఆమె అయోమయంలో పడిపోయారని తెలిసింది. ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్న కొద్ది రోజాలో ఇప్పుడు టెన్షన్ మొదలైయ్యిందని తెలిసింది.

ఇక లాభం లేదని అనుకున్న మంత్రి రోజా తన మీద రగిలిపోయి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న వైసీపీ రెబల్ నాయకులతో రాజీ చర్చలు ప్రారంభించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. అయితే రోజా గిమ్మిక్కులు, జిమ్మిక్కులు మేము నమ్మమని, ఆమె ముసలికన్నీళ్లకు మేము కరిగిపోమని, బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా ఆమెకు మద్దతుగా మేము పని చెయ్యమని నగిరి, నిండ్రా, వడమాల పేట, పుత్తూరుకు చెందిన వైసీపీ నాయకులు తేల్చి చెబుతున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+