అవయవ దానం కు అంగీకరించిన ఏపీ మంత్రి..!!

ఏపీ మంత్రి సత్యకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీవన్ దాన్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అదే వేదికపై అవయవదానానికి అంగీకరిస్తూ సంతకం చేసారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా...‌ ప్రజల్లో మార్పు రాలేదన్నారు. మన రాష్ట్రం లో 260 మంది అవయవ దానం‌కోసం ముందుకు వచ్చారన్నారు. తెలంగాణలో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారన్నారు.

ఇప్పటికే 90 వేల మంది అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారని మంత్రి సత్యకుమార్ చెప్పుకొచ్చారు. యేటా ఐదు లక్షల మంది అవయవాలు చెడి‌పోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని సత్య కుమార్ అన్నారు. జాతీయ స్థాయిలో చాలా స్వల్పంగా ఈ అవయవ దానమ రిజిస్ట్రేషన్ లు ఉన్నాయన్నారు. కొంత మందికి మతాచారాలు అడ్డుగా వస్తున్నాయని అంటున్నారన్నారు. తీసుకునేందుకు లేని అభ్యంతరం ఇచ్చేందుకు లేదన్నారు. ఈ దేవుడు అయినా పరులకు మంచి చేయమనే చెబుతారన్నారు. డయాలసిస్ సెంటర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

Minister Satyakumar agrees for organ donation as jeevandan

కిడ్నీల మార్పిడి కోసం ప్రజలు చాలా మంది క్యూలో ఉన్నారన్నారు. అవయవ దానం వల్ల అంత్యక్రియలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ అంశాలను సీఎం చంద్రబాబు దృష్టి కి తీసుకెళతానని సత్య కుమార్ పేర్కొన్నారు. అవయవదానం చేసిన వారి అంత్యక్రియల్లో కలెక్టర్, ఎస్పీ పాల్గొని వీరవందనం చేసేలా మార్పులు తెస్తామన్నారు. ఆర్ధికంగా కూడా ఆ కుటుంబానికి ఎంతో కొంత సాయం అందించాలని సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ మార్పులపై సీఎం సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నానన్నారు. తన అవయవ దానం పై కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇచ్చానని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+