జగన్ గురించి మాట్లాడే స్థాయా నీది.. పవన్ కళ్యాణ్‌ వెర్రిబాగులోడు!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ మంత్రులు విమర్శనాస్త్రాలు కొనసాగిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు అంటూ పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేస్తూనే, ప్రస్తుతం పవన్ రాజకీయాలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీని పొత్తుల ఎత్తుగడగా అభివర్ణిస్తూ టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో పనికిమాలినోడు, వెర్రిబాగులోడు అంటూ పవన్ కళ్యాణ్ పై తమదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.

పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు

పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు

ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజు పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ పై ఇప్పటికే ప్యాకేజీ స్టార్ అంటూ విరుచుకుపడిన మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా మరోమారు జనసేన, టిడిపిని లింకు పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయారని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ ఓ వెర్రి బాగులోడు అంటూ ఆగ్రహం

పవన్ కళ్యాణ్ ఓ వెర్రి బాగులోడు అంటూ ఆగ్రహం

పవన్ కళ్యాణ్ ఓ వెర్రిబాగులోడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు పవన్ కళ్యాణ్ కేవలం రేటు తీసుకున్న యాక్టర్ మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కూడా ఆయన పాత్ర అక్కడికే పరిమితం అని మంత్రి సీదిరి అప్పలరాజు తేల్చి చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. నారా లోకేష్ యువ గళం, పవన్ యువశక్తి పేరు పెట్టుకున్నారు అంటే కథ, స్క్రీన్ ప్లే అంతా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోని సిద్ధమయ్యిందని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.

మత్స్యకారుల సమస్యల పట్ల పవన్ కు అవగాహన లేదు

మత్స్యకారుల సమస్యల పట్ల పవన్ కు అవగాహన లేదు


చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలవడం అంటే వాటి ఇరువురి మధ్యలో ప్యాకేజీలకు సంబంధించిన చర్చలు ఉంటాయే తప్ప, ప్రజా సమస్యలపై చర్చ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇక మత్స్యకారులకు భరోసా ఇస్తామని చెబుతున్న పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ కు అసలు మత్స్యకారుల సమస్య పట్ల ఏమాత్రం అవగాహన లేదని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యానించారు.

నాదెండ్ల మనోహర్ టార్గెట్ .. ఓ పనికిమాలిన వ్యక్తి అంటూ

నాదెండ్ల మనోహర్ టార్గెట్ .. ఓ పనికిమాలిన వ్యక్తి అంటూ

నాదెండ్ల మనోహర్ ఓ పనికిమాలిన వ్యక్తి అని విమర్శించిన ఆయన, మత్స్యకారులకు, ఉద్దానం ప్రజలకు ఏం కావాలో వైయస్ జగన్ ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలో మత్స్యకారులకు, ఉద్దానం కిడ్నీ బాధితులకు ఏ విధమైన సహాయం అందలేదని, వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అన్ని విధాలుగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+