బోనులో చేతులు కట్టుకుని నిలబడేవాళ్ళా మాకు చెప్పేది... వైసీపీ నేతలపై సోమిరెడ్డి ఫైర్
Recommended Video
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్షలపై పలు ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత ఎట్టకేలకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో వ్యవసాయ శాఖ అధికారులతో అమరావతిలో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న కరువు , మరియు తుఫాను నష్టాలపై ఆయన చర్చించారు. సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు .

బోనులో చేతులు కట్టుకుని నిలబడేవాళ్ళా విమర్శించేది అన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
జగన్, విజయసాయిరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నేతలను టార్గెట్ చేసి మాట్లాడిన సోమిరెడ్డి వైసీపీ ముఖ్య నేతలపై చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ప్రతి శుక్రవారం కోర్టు బోనులో చేతులు కట్టుకుని నిలబడేవాళ్లు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి . విజయసాయిరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నేతలా మాకు చెప్పేది? అంటూ ఆయన వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు . వాళ్లపై ఏడేసి కేసులున్నాయని అన్న సోమిరెడ్డి

వైసీపీ నేతలకు చట్టాలు తెలియవు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు తెలీవని ఎద్దేవా
ఇక వైసీపీ నేతలకు ఏం తెలుసనీ ప్రశ్నించిన సోమిరెడ్డి కనీసం ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, చట్టాలు కూడా తెలియని నేతలు వైసీపీ నేతలని విమర్శించారు. అసలు రాష్ట్రంలో పాలన ఎలా ఉంటుందో ? ఎలా ఉండాలో కూడా తెలియని నేతలని వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు . రాష్ట్రంలో మూడు రకాల పాలనకు అవకాశం ఉంటుందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ పాలన, ఆపద్ధర్మ పాలన, రాష్ట్రపతి పాలన ఉంటాయని, ఇవేవీ వైసీపీ నేతలకు తెలియవని ఎద్దేవా చేశారు.

ఏపీ ప్రభుత్వంపై బురద చల్లటమే లక్ష్యం .. ప్రతీది సొమ్ము చేసుకునే దృష్టి వైసీపీ నాయకులదన్న మంత్రి సోమిరెడ్డి
ఇక సమీక్షల పేరుతో దండుకునే రాజకీయం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుపై, మంత్రులపై చేస్తున్న వ్యాఖ్యలకు ప్రతిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతిదాన్ని సొమ్ము చేసుకోవడంపైనే వైసీపీ నాయకుల దృష్టి ఉండేదని, ఇప్పుడు తమపై బురదజల్లడమే ధ్యేయంగా పెట్టుకుని మాట్లాడుతున్నారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయరంగంలో ప్రథమస్థానంలో ఉందని మంత్రి సోమిరెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చే నిధులు తింటున్నామని నోటికొచ్చినట్టు ఆరోపిస్తున్న నేతలు, ఏపీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలు చూసి సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications